Vishnu Vinyasam Day 2 Collections: విష్ణు విన్యాసంకు డీసెంట్ కలెక్షన్స్..శ్రీవిష్ణు మూవీకి రెండో రోజు ఎంతంటే?
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైనర్ శ్రీవిష్ణు, యంగ్ హీరోయిన్ నయన సారిక జంటగా నటించిన చిత్రం విష్ణు విన్యాసం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో సుమంత్ నాయుడు జీ నిర్మించగా... యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు విష్ణు విన్యాసం మూవీలో కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా.. రాదన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీకేయన్ రోహిణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరి 27వ తేదిన విష్ణు విన్యాసం మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో విష్ణు విన్యాసం మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు శ్రీ విష్ణు మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే..
విష్ణు విన్యాసంకు రికార్డ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి విష్ణు విన్యాసం మూవీకి 19 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాల నేపథ్యంలో విష్ణు విన్యాసం మూవీపై హైప్ నెలకొంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఈ సినిమా 26 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తద్వారా 7 కోట్ల రూపాయల లాభాలను ముందే అందుకుంది ఈ చిత్రం.

విష్ణు విన్యాసం బ్రేక్ ఈవెన్ టార్గెట్
విష్ణు విన్యాసం మూవీకి ఆంధ్రా, నైజాంలలో 7 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల రూపాయల రేంజ్‌లో బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో శ్రీ విష్ణు మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 12 కోట్ల రూపాయల షేర్, 25 కోట్ల రూపాయల గ్రాస్ చొప్పున వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించాయి. తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో విష్ణు విన్యాసం మూవీని వరల్డ్ వైడ్‌గా 900 థియేటర్స్‌లో విడుదల చేశారు.
విష్ణు విన్యాసం తొలిరోజు కలెక్షన్స్
శ్రీవిష్ణు మూవీకి తొలిరోజున ఇండియాలో 2 కోట్ల రూపాయల నెట్.. 2.35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక విష్ణు విన్యాసం ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. అమెరికాలో 247 సెంటర్స్‌కు గాను 369 షోలు ఏర్పాటు చేయగా... 2818 టికెట్లు అమ్ముడై 41432 డాలర్లు (భారత కరెన్సీలో 38 లక్షల రూపాయలు) వసూలైంది. ఇక యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి ఓవరాల్‌గా ఓవర్సీస్ నుంచి విష్ణు విన్యాసం మూవీ తొలిరోజున 1,25,777 డాలర్లు (1.15 కోట్ల రూపాయలు) రాబట్టినట్లు ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. మొత్తంగా తొలిరోజున వరల్డ్ వైడ్‌గా విష్ణు విన్యాసం మూవీ 3.25 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది. తెలంగాణలో 1.03 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 73 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది.
విష్ణు విన్యాసం రెండో రోజు కలెక్షన్స్
విష్ణు విన్యాసం మూవీకి రెండో రోజున మరింత మెరుగైన బుకింగ్స్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ శ్రీవిష్ణు క్రేజ్ కారణంగా యువత నుంచి ఆదరణ లభిస్తోంది. రెండో రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు విష్ణు విన్యాసం మూవీకి ఇండియాలో 23 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. కడపటి వార్తలు అందేసరికి శ్రీవిష్ణు మూవీకి రెండో రోజున ఇండియాలో 45 లక్షల రూపాయల నికర వసూళ్లు వచ్చాయి. రెండో రోజు విష్ణు విన్యాసం మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 2.25 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 3.50 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తద్వారా రెండ్రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టవచ్చని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











