Vishnu Vinyasam Day 4 Collections: శ్రీవిష్ణు మూవీకి భారీ వసూళ్లు.. విష్ణు విన్యాసంకు 4వ రోజు ఎన్ని కోట్లంటే?
యదునాథ్ మారుతిరావు దర్శకత్వంలో కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం విష్ణు విన్యాసం. ఫిబ్రవరి 27న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. రిలీజైన మూడు వారాల్లోనే మంచి వసూళ్లు సాధించి .. శ్రీవిష్ణు క్రేజ్‌ని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో విష్ణు విన్యాసం మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు శ్రీ విష్ణు మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే..
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో సుమంత్ నాయుడు జీ విష్ణు విన్యాసం మూవీని నిర్మించారు. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు విష్ణు విన్యాసం మూవీలో కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా.. రాదన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీకేయన్ రోహిణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

విష్ణు విన్యాసంకు రికార్డ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి విష్ణు విన్యాసం మూవీకి 19 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఈ సినిమా 26 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తద్వారా 7 కోట్ల రూపాయల లాభాలను ముందే అందుకుంది ఈ చిత్రం.
విష్ణు విన్యాసం బ్రేక్ ఈవెన్ టార్గెట్
విష్ణు విన్యాసం మూవీకి ఆంధ్రా, నైజాంలలో 7 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల రూపాయల రేంజ్‌లో బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో శ్రీ విష్ణు మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 12 కోట్ల రూపాయల షేర్, 25 కోట్ల రూపాయల గ్రాస్ చొప్పున వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించాయి. తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో విష్ణు విన్యాసం మూవీని వరల్డ్ వైడ్‌గా 900 థియేటర్స్‌లో విడుదల చేశారు.
విష్ణు విన్యాసం మూడు రోజుల కలెక్షన్స్
శ్రీవిష్ణు మూవీకి తొలిరోజున 2 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.3 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో మూడు రోజుల వరకు 6.8 కోట్ల రూపాయల నెట్.. 8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల స్థాయిలోనే ఓవర్సీస్‌లోనూ విష్ణు విన్యాసం మూవీ సందడి చేస్తోంది. ఈ సినిమాకు మూడు రోజుల వరకు విదేశాల్లో 2,31,777 డాలర్లు (భారత కరెన్సీలో 2.11 కోట్ల రూపాయలు) వసూలైంది.
భారత్‌లో వచ్చిన గ్రాస్ ప్లస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి విష్ణు విన్యాసం మూవీకి వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల వరకు 10.20 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అయితే శ్రీవిష్ణు మూవీకి ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో 14.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర నిర్మాత అధికారికంగా తెలిపారు. విష్ణు విన్యాసం మూవీకి నైజాంలో 2 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 1.50 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయల చొప్పున ఇప్పటి వరకు 5.50 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
విష్ణు విన్యాసం 4వ రోజు వసూళ్ల అంచనా
వీకెండ్‌లో కుమ్మేసిన శ్రీవిష్ణుకు సోమవారం నుంచి అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. పరీక్షల సీజన్‌తో పాటు వర్కింగ్ డేస్ కావడంతో దాని ప్రభావం కలెక్షన్స్‌పై పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాలుగో రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు విష్ణు విన్యాసం మూవీకి ఇండియాలో 16 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. రేపు హోలీ సందర్భంగా సెలవు దినం కావడంతో సోమవారం ఫస్ట్ షో, సెకండ్ షోలకు మెరుగైన ఆక్యూపెన్సీ లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ లెక్కన నాలుగు రోజు విష్ణు విన్యాసం మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 15 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 40 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సాక్‌నిక్ లెక్కల ప్రకారం నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టవచ్చని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











