Vishnu Vinyasam Day 5 Collections:‘విష్ణు విన్యాసం' బాక్సాఫీస్ రిపోర్ట్.. శ్రీవిష్ణు మూవీకి ఎన్ని కోట్లంటే?

Vishnu Vinyasam Collections: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) వరుస విజయాలతో మంచి ఫామ్‌లో కొనసాగుతున్నారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్, శ్వాగ్, సింగిల్ వంటి హిట్స్ తర్వాత తాజాగా ఆయన నటించిన విష్ణు విన్యాసం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డెబ్యూ డైరెక్టర్ యదునాథ్ మారుతి రావు (Yadunath Maruti Rao) తెరకెక్కించిన ఈ కామెడీ-ఫ్యామిలీ డ్రామా ఫిబ్రవరి 27న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో విష్ణు విన్యాసం మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఐదో రోజు శ్రీ విష్ణు మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే..

శ్రీ విష్ణు - నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమా కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవింపుతో తెరకెక్కింది. సినిమాలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సన్నివేశాలు అన్ని కలిపి ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మించారు. సినిమాటోగ్రఫీని సాయి శ్రీరామ్ నిర్వహించగా, సంగీతాన్ని రాదన్ అందించారు. ఎడిటింగ్ బాధ్యతలను కార్తీకేయన్ రోహిణి నిర్వర్తించారు. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్ని సినిమా టోన్‌కు తగ్గట్టుగా సపోర్ట్ చేశాయి.

Vishnu Vinyasam Day 5 Expected Box Office Collections Worldwide Sree Vishnu s film sees a rise in occupancy

ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో రికార్డు
టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'విష్ణు విన్యాసం' సినిమాకు సుమారు రూ.19 కోట్ల బడ్జెట్ ఖర్చయిందని తెలుస్తోంది. అయితే ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కుల రూపంలో మొత్తం రూ.26 కోట్ల వరకు బిజినెస్ సాధించింది. అంటే విడుదలకు ముందే సుమారు రూ.7 కోట్ల లాభాలను అందుకుందని ట్రేడ్ అంచనా. ఇక బ్రేక్ ఈవెన్ లెక్కలను ఏరియా వారీగా చూసుకుంటే.. ఆంధ్రా, నైజాం కలిపి రూ.7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ.1 కోటి, ఓవర్సీస్ రూ.3 కోట్లు.

ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.11 కోట్ల రేంజ్‌లో థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.12 కోట్ల షేర్, దాదాపు రూ.25 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 'విష్ణు విన్యాసం'ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 900 థియేటర్లలో విడుదల చేశారు. రిలీజైన మూడు వారాల్లోనే మంచి కలెక్షన్లు సాధించి, శ్రీ విష్ణు మార్కెట్‌ను మరింత బలోపేతం చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

విష్ణు విన్యాసం కలెక్షన్స్
టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన కామెడీ డ్రామా 'విష్ణు విన్యాసం' బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుంది. శ్రీవిష్ణు మూవీకి తొలిరోజు రూ. 2 కోట్లు, రెండో రోజు రూ. 2.5 కోట్లు, మూడో రోజు రూ. 2.3 కోట్ల చొప్పున ఇండియాలో మూడు రోజుల వరకు 6.8 కోట్ల రూపాయల నెట్.. 8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.ఇక మొదటి వర్కింగ్ డే అయిన సోమవారం నుంచి సహజంగానే వసూళ్లలో తగ్గుదల కనిపించింది. సుమారు రూ.90 లక్షల రేంజ్‌లోనే కలెక్షన్లు నమోదు కావడం ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా నాలుగు రోజుల్లో మొత్తం రూ.7.58 కోట్ల కలెక్షన్లతో 'విష్ణు విన్యాసం' బాక్సాఫీస్ ప్రయాణం సాగిస్తోంది.

అయితే.. తొలి వీకెండ్ ముగిసే నాటికి విష్ణు విన్యాసం వరల్డ్‌వైడ్‌గా రూ. 14.7 కోట్ల మార్కును గ్రాస్ చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకుల మౌత్ టాక్‌తో ఈ సినిమా వసూళ్లు పెరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని వారు తెలిపారు. ఇక ఐదో రోజు (మంగళవారం) కలెక్షన్లు చూస్తేంటే.. ఈ రోజు హాలీడే కాబట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ట్రేడ్ అంచనాల ప్రకారం.. ఐదో రోజు కలెక్షన్లు రూ. 1 కోటి నుంచి 1.2 కోట్ల వరకు రావొచ్చని అంచనా. ఈ లెక్కన చూస్తూ.. భారత్‌ గ్రాస్ కలెక్షన్స్ 8.5 నుంచి 9 కోట్లు, ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి విష్ణు విన్యాసం మూవీకి వరల్డ్ వైడ్‌గా ఐదు రోజుల్లో రూ. 12 కోట్ల నుంచి 13 కోట్లు మధ్య గ్రాస్ అందుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X