Vishnu Vinyasam Day 6 Collections: విష్ణు విన్యాసంకి షాకింగ్ కలెక్షన్స్.. శ్రీవిష్ణు మూవీకి ఎన్ని కోట్లంటే?

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో సుమంత్ నాయుడు జీ నిర్మించిన చిత్రం విష్ణు విన్యాసం. యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు, నయన్ సారిక ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 27న విష్ణు విన్యాసం మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు విష్ణు విన్యాసం మూవీలో కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా.. రాదన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీకేయన్ రోహిణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో విష్ణు విన్యాసం మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు శ్రీ విష్ణు మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే..

విష్ణు విన్యాసం బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి విష్ణు విన్యాసం మూవీకి 19 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే.. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఈ సినిమా 26 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తద్వారా 7 కోట్ల రూపాయల లాభాలను ముందే అందుకుంది ఈ చిత్రం.

Vishnu Vinyasam Day 6 Expected Box Office Collections Worldwide Sree Vishnu s film faces huge drop

విష్ణు విన్యాసం బ్రేక్ ఈవెన్ టార్గెట్
విష్ణు విన్యాసం మూవీకి ఆంధ్రా, నైజాంలలో 7 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల రూపాయల రేంజ్‌లో బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో శ్రీ విష్ణు మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 12 కోట్ల రూపాయల షేర్, 25 కోట్ల రూపాయల గ్రాస్ చొప్పున వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించాయి. తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో విష్ణు విన్యాసం మూవీని వరల్డ్ వైడ్‌గా 900 థియేటర్స్‌లో విడుదల చేశారు.

విష్ణు విన్యాసం 5 రోజుల కలెక్షన్స్
శ్రీవిష్ణు మూవీకి తొలిరోజున 2 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.3 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.2 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.31 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 5 రోజుల వరకు 9.26 కోట్ల రూపాయల నెట్.. 9.35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలైనట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇక విష్ణు విన్యాసం మూవీ ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. ఆదివారం వరకు నార్త్ అమెరికాలో 209K డాలర్లు (1.93 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు ఈ సినిమా 2.65 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు విష్ణు విన్యాసం మూవీ వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లుగా సాక్‌నిక్ తెలిపింది. అయితే మూడు రోజుల్లోనే శ్రీవిష్ణు విష్ణు మూవీ ప్రపంచవ్యాప్తంగా 14.7 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

విష్ణు విన్యాసం 6వ రోజు వసూళ్లు అంచనా
వీకెండ్‌లో అద్భుతంగా రాణించిన విష్ణు విన్యాసం మూవీపై వర్కింగ్ డేస్, ఎగ్జామ్స్ సీజన్ గట్టి దెబ్బ కొట్టినట్లుగా తెలుస్తోంది. సిటీలతో పాటు రూరల్ ఏరియాలలోనూ ఈ సినిమాకు ఆక్యూపెన్సీ పడిపోతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. మంగళవారం హోలీ పండుగ, సెలవు రోజు అయినప్పటికీ వసూళ్లు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. 6వ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండియాలో శ్రీవిష్ణు మూవీకి 14 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది. కడపటి వార్తలు అందేసరికి విష్ణు విన్యాసం మూవీకి ఇండియాలో 22 లక్షల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయి.

6వ రోజు శ్రీవిష్ణు మూవీకి తెలుగు రాష్ట్రాలలో కోటి రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షలు, ఓవర్సీస్‌లో 30 లక్షల రూపాయల వరల్డ్ వైడ్‌గా 1.60 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో విష్ణు విన్యాసం మూవీ ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల రూపాయల వసూళ్లను సాధిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆల్రెడీ 7 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్‌ను సొంతం చేసుకున్న శ్రీవిష్ణు మూవీ.. సాక్‌నిక్ లెక్కల ప్రకారం థియేట్రికల్ రన్‌లో బ్రేక్ఈవెన్ కావాలంటే మరో 6 కోట్ల రూపాయల షేర్.. 11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X