Vishnu Vinyasam Business: విష్ణు విన్యాసం బిజినెస్.. శ్రీవిష్ణు మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

మాస్, యాక్షన్, సెంటిమెంట్, ప్రయోగాల జోలికి పోకుండా రెండున్నర గంటల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ప్రయత్నిస్తారు యంగ్ హీరో శ్రీవిష్ణు. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్న ఈ నటుడు... హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు శ్రీవిష్ణు. చిన్న నిర్మాతలకు మినిమమ్ గ్యారంటీ హీరోగా, ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయని నటుడిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. తాజాగా శ్రీవిష్ణు నటించిన చిత్రం విష్ణు విన్యాసం. ఫిబ్రవరి 27వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు విన్యాసం సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. రిలీజ్‌కు ముందే లాభాల్లోకి వచ్చింది. ఈ వివరాలు పరిశీలిస్తే..

విష్ణు విన్యాసం తారాగణం
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో సుమంత్ నాయుడు జీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు విన్యాసం మూవీలో శ్రీవిష్ణు సరసన నయన్ సారిక, సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు వై మారుతిరావు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా.. రాదన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీకేయన్ రోహిణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Vishnu Vinyasam Worldwide Business Sree Vishnu s films Locks 7 Crore Profit Before Release

విష్ణు విన్యాసం అరుదైన ఘనత
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు దేశంలో ఏ ఇండస్ట్రీ పరిస్ధితి బాలేదు. ఎన్నో అంచనాల మధ్య రిలీజవుతున్న సినిమాలు సైతం చేతులెత్తేస్తున్నాయి. ఆదుకుంటాయని అనుకున్న చిన్న సినిమాలు కూడా బోల్తా కొడుతున్నాయి. లాభాల సంగతి దేవుడెరుగు.. కనీసం పెట్టిన పెట్టుబడైనా తిరిగొస్తే చాలు అనుకుంటున్నారు నిర్మాతలు. అలాంటిది సినిమాను రిలీజ్ చేయడానికి ముందే శ్రీవిష్ణు మూవీ లాభాల్లోకి వచ్చిందన్న వార్త ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఆశ్చర్యకరంగా మారింది.

విష్ణు విన్యాసంకు రికార్డ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి విష్ణు విన్యాసం మూవీకి 19 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్‌తో పాటు శ్రీవిష్ణు సినిమాల క్రేజ్ నేపథ్యంలో ఈ మూవీపై హైప్ నెలకొంది. దాంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ల నుంచి మంచి పోటీ కనిపించింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఈ సినిమా ఇప్పటికే 26 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో పెట్టుబడి మీద దాదాపు 7 కోట్ల రూపాయల ట్రేబుల్ ప్రాఫిట్‌‌ను అందించాడు శ్రీవిష్ణు. రిలీజ్‌కు ముందే భారీ లాభాలు తీసుకురావడంతో విష్ణు విన్యాసం బిజినెస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దాంతో థియేటర్‌లో వచ్చేదంతా నిర్మాతలకు అదనపు లాభమే.

విష్ణు విన్యాసంకు బాక్సాఫీస్ క్లాష్
కాగా.. శ్రీవిష్ణు నటించిన మరో చిత్రం మృత్యుంజయ్‌తో విష్ణు విన్యాసం మూవీ క్లాష్ అవుతుందని అంతా భావించారు. అయితే రెండు చిత్రాల నిర్మాతలు రాజీకి రావడంతో బాక్సాఫీస్ క్లాష్ తప్పింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27న మృత్యుంజయ్, 28న విష్ణు విన్యాసం సినిమాలు విడుదల కావాల్సి ఉంది. అదే జరిగితే రెండు సినిమాలకు నష్టం కలిగేలా ఉండటంతో శ్రీవిష్ణు రంగంలోకి దిగి పరిస్ధితి చక్కదిద్ది డేట్స్ సర్దుబాటు చేసుకునేలా నిర్మాతలను ఒప్పించారు. దాంతో ఫిబ్రవరి 27వ తేదీన విష్ణు విన్యాసం.. మార్చి 6వ తేదీన మృత్యుంజయ్‌ మూవీ రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X