Das Ka Dhamki day 2 collections అలాంటి టాక్ వచ్చినా తగ్గని కలెక్షన్స్.. రెండవ రోజు లెక్క ఇది!
టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన మాస్ యాక్షన్ మూవీ దాస్ కా ధమ్కీ సినిమా ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ హీరోగా నటించడమే కాకుండా తనే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ డిఫరెంట్ మాస్ ఎంటర్టైనర్ విభిన్నమైన టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా రెండో రోజు కూడా చాలా ఏరియాలలో మంచి వసూళ్లను సాధించింది. ఇక రెండవ రోజు దాస్ కా ధమ్కీ సినిమా ఏ స్థాయిలో కలెక్ట్ చేయవచ్చు అనే వివరాల్లోకి వెళితే..

విశ్వక్ సేన్ బిగ్ బడ్జెట్
యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విశ్వక్ సేన్ ఈసారి పూర్తిస్థాయిలో మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలి అని దాస్ కా దమ్కీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాను దాదాపు 20 కోట్ల బడ్జెట్ తోనే తెరపైకి తీసుకు వచ్చినట్లుగా టాక్ అయితే వచ్చింది. ఒక విధంగా విశ్వక్ కెరీర్ లోనే ఇది అత్యధిక బడ్జెట్ అని చెప్పవచ్చు.

మొత్తం బిజినెస్ ఎంతంటే..
ఇక ఈ సినిమా మొదటి ట్రైలర్ తోనే ఓ వర్గం ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా మాస్ ఏరియాలలో ఈ సినిమాకు పాజిటివ్ బజ్ ఉండడంతో భారీ స్థాయిలోనే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో కూడా డిమాండ్ ప్రకారం మంచి బిజినెస్ చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు 7 కోట్ల వరకు థియేట్రికల్ హక్కులు అమ్ముడైనట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా ఈ సినిమా 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ సెట్ చేసుకుంది.

ఫస్ట్ డే కుమ్మేసిన ధమ్కీ
ఇక మొదటిరోజు ధమ్కీ సినిమా మాస్ ఏరియాలలో అయితే మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. పోటీగా పెద్ద సినిమాలు కూడా లేకపోవడంతో చాలా ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ నైజాంలో ఈ సినిమా 5.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8.20 కోట్ల వరకు గ్రాస్, 4.08 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

2వ రోజు థియేట్రికల్ ఆక్యుపెన్సీ
ఇక ఈ సినిమా విభిన్నమైన టాక్ తో ముందుకు సాగుతోంది. ధమ్కీ థియేట్రికల్ ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే ఉదయం షోలకు 26.96% ఆక్యుపేసి నమోదు కాగా మధ్యాహ్నం 27.25% వరకు ఆక్యుపెన్సి నమోదయింది. ఇక సాయంత్రం షోలకు వచ్చేసరికి దాదాపు 30% వరకు ఆక్యుపెన్సి నమోదయినట్లుగా తెలుస్తోంది.

రెండవ రోజు ఎంత
ఇక మొత్తంగా ధమ్కీ సినిమా అయితే విశ్వక్ కెరీర్ మొత్తంలోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా ధమ్కీ నిలిచింది. ఇక ఈ సినిమా రెండవ రోజు ఇండియా మొత్తంలో కూడా 2.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక మొదటి రోజు 5.30 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఇండియాలో ఈ సినిమా రెండు రోజుల్లో నెట్ కలెక్షన్స్ లెక్క 7.80 కోట్ల వరకు చేరవచ్చు.

ఇంకా ఎంత రావాలి?
మొదటి రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 4.08 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక రెండవ రోజు దాదాపు 1 కోటికి పైగా షేర్ కలెక్షన్స్ వచ్చినట్లుగా అయితే తెలుస్తోంది.
ఇక ఈ సినిమా బిజినెస్ ప్రకారం అయితే మొత్తంగా 8 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. అంటే బాక్సాఫీస్ వద్ద మరొక మూడు కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే హిట్ అయినట్లు లెక్క. మరి ఈ వీకెండ్ లో సినిమా ఈ టార్గెట్ ను ఎంత త్వరగా ఫినిష్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











