Das Ka Dhamki 4 Days Collection: విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్.. కొత్త రికార్డ్.. లాభాల్లో మూవీ!

హీరో విశ్వక్ సేన్ మాస్ కా దాస్ గా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. గతేడాది ఓరి దేవుడా చిత్రంతో ఆడియెన్స్ మెప్పు పొందిన విశ్వక్ సేన్ ఈ ఏడాది దాస్ కా ధమ్కీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఉగాది పండుగ పురస్కరించుకుని మార్చి 22న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది. అయితే ఈ సినిమాకు టాక్ సంగతి ఎలా ఉన్న కలెక్షన్ల పరంగా సత్తా చాటుతోంది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ చిత్రానికి 4వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేద్దాం.

లియాన్ జేమ్స్ సంగీతం..

లియాన్ జేమ్స్ సంగీతం..

వెళ్లిపోమాకే అనే లవ్ స్టోరీతో హీరోగా పరిచయమయ్యాడు మాస్​ కా దాస్​ విశ్వక్ సేన్. ఆ తర్వాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది, ఫలక్​నూమా దాస్​ సినిమాలతో మాస్​ ఆడియెన్స్ ను మెప్పించాడు. అనంతరం పాగల్​ మూవీతో లవర్ బాయ్​ గా అలరించాడు. ఇప్పుడు ఈ ఈడాది 'దాస్ కా ధమ్కీ' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మార్చి 22న విడుదలైన ఈ సినిమాకు లియాన్ జేమ్స్ సంగీతం అందించాడు.

 రెండోసారి నిర్మాతగా..

రెండోసారి నిర్మాతగా..

అశోక వనంలో అర్జున కల్యాణం, హిట్ వంటి సినిమాలతో వయసుకు మించిన క్యారెక్టర్స్ చేసి అలరించాడు విశ్వక్ సేన్. అలాగే యంగ్ ఏజ్ లోనే హీరోగా చేస్తూనే డైరెక్టర్ గా సత్తా చాటుతున్నాడు. తాజాగా విశ్వక్ డైరెక్ట్ చేసిన మూవీ 'దాస్ కా ధమ్కీ'. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు రెండోసారి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను సుమారు రూ. 20 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇలా చూసుకుంటే విశ్వక్ సేన్ సినీ కెరీర్ లోనే ఈ మూవీ అత్యధిక బడ్జెట్ చిత్రంగా నిలిచింది.

 ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

మాస్ హీరో విశ్వక్ సేన్, బ్యూటిఫుల్ నివేదా పేతురాజ్ రెండోసారి జోడీ కట్టిన చిత్రం 'దాస్ కా ధమ్కీ'. ఈ చిత్రాన్ని తన కెరీర్ లోనే మొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశాడు విశ్వక్. ఈ క్రమంలో అతనికి మార్కెట్ కు తగినట్లుగానే ప్రీ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్ లో రూ. 1 కోటి, ఆంధ్రాలో రూ. 2.8 కోట్లు కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 6.80 కోట్లు బిజినెస్ చేసింది. అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి రూ. 70 లక్షల బిజినెస్ అయింది. దీంతో విశ్వక్ సేన్ సినిమాకు రూ. 7.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరగ్గా.. రూ. 8 కోట్లు బ్రేక్ ఈవెన్ గా ఫిక్స్ అయింది.

థియేటర్ ఆక్యుపెన్సీ..

థియేటర్ ఆక్యుపెన్సీ..

విశ్వక్ సేన్ తాజా చిత్రం 'దాస్ కా ధమ్కీ' యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్ పై నిర్మించగా.. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. ఇక ఈ సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేశారు. మార్చి 22న థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ తో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో 'దాస్ కా ధమ్కీ' 4వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. ఉదయం షోలకు 30.15 శాతం, మధ్యాహ్నానికి 33.42 శాతం, ఇక సాయంత్రానికి బాగానే పెరిగి 41.84 శాతంగా నమోదు అయింది. అయితే వీకెండ్ విశ్వక్ సేన్ కు కలిసివచ్చినట్లు తెలుస్తోంది.

 4వ రోజు కలెక్షన్స్..

4వ రోజు కలెక్షన్స్..

'దాస్ కా ధమ్కీ' సినిమాకు ట్రైలర్ తోనే కాకుండా సాంగ్స్ తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నివేదా పేతురాజ్ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉందని కామెంట్లు వినపడుతున్నాయి. ఇక ఈ సినిమాకు తొలి రోజు మంచి ఓపెనింగ్స్ లభించాయి. విశ్వక్ సేన్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా రికార్డ్ నమోదు అయింది. ఈ క్రమంలో 'దాస్ కా ధమ్కీ' చిత్రానికి 4వ రోజు రూ. 2.50 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

4 రోజుల్లో వచ్చింది..

4 రోజుల్లో వచ్చింది..

విభిన్న ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు హీరో విశ్వక్ సేన్. ఈ క్రమంలోనే 'దాస్ కా ధమ్కీ' సినిమాలో తొలిసారిగా డ్యూయెల్ రోల్ లో కనిపించాడు. దీంతో ఈ సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. అలా విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీకి 4 రోజుల్లో రూ. 11.75 ఇండియా నెట్ కలెక్షన్స్ రానున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

కెరీర్ లోనే బిగ్గెస్ట్.. లాభాల్లోకి..

కెరీర్ లోనే బిగ్గెస్ట్.. లాభాల్లోకి..

కాగా విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వం వహించిన 'దాస్ కా ధమ్కీ' సినిమా 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇది విశ్వక్ సేన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాకు రూ. 1.14 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ పూర్తి కానుంది. వీకెండ్ అయిన శనివారం రోజున ఆ మార్క్ దాటి విశ్వక్ మూవీ లాభాల్లోకి చేరనున్నట్లు అర్థమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X