Das Ka Dhamki 5 Days Collection: అలాంటి వసూళ్లతో ధమ్కీ.. విశ్వక్ తండ్రికి లాభాలు ఎంతంటే?

హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా సత్తా చాటుతున్న యంగ్ హీరో విశ్వక్ సేన్. ఫలక్​నూమా దాస్​ సినిమాతో మొదటిసారిగా మెగా ఫోన్ పట్టుకున్న విశ్వక్ సేన్ తాజాగా మరోసారి డైరెక్టర్ అవతారం ఎత్తాడు. సుమారు నాలుగేళ్ల తర్వాత విశ్వక్ డైరెక్ట్ చేసిన సినిమా 'దాస్ కా ధమ్కీ'. ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదలైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తున్న కలెక్షన్స్ మాత్రం పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధమ్కీ చిత్రానికి 5వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేస్తే..

టాలీవుడ్ టాక్..

టాలీవుడ్ టాక్..

యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ తన లేటెస్ట్ సినిమా 'దాస్ కా ధమ్కీ'తో మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాను సుమారు రూ. 20 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా చూసుకుంటే విశ్వక్ సేన్ సినీ కెరీర్ లోనే 'దాస్ కా ధమ్కీ' మూవీ అత్యధిక బడ్జెట్ చిత్రంగా నిలిచింది.

ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

విశ్వక్ సేన్ రెండోసారి దర్శకత్వం వహించిన 'దాస్ కా ధమ్కీ' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ మార్కెట్ కు తగినట్లుగానే ప్రీ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్ లో రూ. 1 కోటి, ఆంధ్రాలో రూ. 3 కోట్లు కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 7 కోట్లు బిజినెస్ చేసిందని సమాచారం. అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 80 లక్షలు కాగా.. ఓవర్సీస్ కలుపుని మొత్తంగా రూ. 10 కోట్లుగా బిజినెస్ జరిగినట్లు విశ్లేషకులు తెలిపారు.

థియేటర్ కౌంట్..

థియేటర్ కౌంట్..

విశ్వక్ సేన్, బ్యూటిఫుల్ నివేదా పేతురాజ్ రెండోసారి జత కట్టిన 'దాస్ కా ధమ్కీ' సినిమా ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రావడంతో సినిమాపై హైప్ పెరిగింది. అందుకే ఈ సినిమాను తెలంగాణలో 220 స్క్రీన్స్, ఆంధ్రప్రదేశ్ లో 220 థియేర్స్, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 210 సెంటర్స్ లో రిలీజ్ చేశారు. ఇక ఓవర్సీస్ తోపాటు వరల్డ్ వైడ్ గా కలుపుకుని 650 థియేటర్లలో విడుదల చేశారు.

థియేటర్ ఆక్యుపెన్సీ..

థియేటర్ ఆక్యుపెన్సీ..

విశ్వక్ సేన్ తాజా చిత్రం 'దాస్ కా ధమ్కీ'కి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. ఇక థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు విభిన్నమైన టాక్ తో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో 'దాస్ కా ధమ్కీ' 5వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. ఉదయం షోలకు 29.94 శాతం, మధ్యాహ్నానికి 34.11 శాతం, ఇక సాయంత్రానికి పెరిగి 42.33 శాతంగా నమోదు అయినట్లు సమాచారం.

5వ రోజు కలెక్షన్స్..

5వ రోజు కలెక్షన్స్..

'దాస్ కా ధమ్కీ' సినిమా విడుదలైన రోజే బెస్ట్ ఓపెనింగ్స్ దక్కాయి. విశ్వక్ సేన్ లేటెస్ట్ సినిమాకు టాక్ పరంగా ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం పర్వాలేదనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే 'దాస్ కా ధమ్కీ' చిత్రానికి 5వ రోజున రూ. 2.30 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే సినిమా విడుదలైన మొదటి సండే మంచి కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.

5 రోజుల్లో వచ్చింది..

5 రోజుల్లో వచ్చింది..

విశ్వక్ సేన్ మొదటి సారిగా ద్విపాత్రాభినయం చేసిన 'దాస్ కా ధమ్కీ' సినిమాకు మాస్ ఆడియెన్స్ బాగానే వస్తున్నట్లు సమాచారం అందుతోంది. అందుకే ఈ సినిమా 5 రోజుల్లో రూ. 13.80 ఇండియా నెట్ కలెక్షన్స్ సాధించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా 4 రోజుల్లోనే రూ. 18.1 కోట్లు గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా వసూళు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక 5వ రోజు కలెక్షన్స్ తో ఈ గ్రాస్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజుకు లాభాలు రావాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందేనని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X