Das Ka Dhamki 6 Days Collection: వర్కింగ్ డేలోనూ అన్ని కోట్లు.. బ్లాక్ బస్టర్ హిట్! మొత్తంగా ఎంతంటే?
'హిట్: ఫస్ట్ కేస్', 'అశోక వనంలో అర్జున కల్యాణం' వంటి సినిమాల్లో తన వయసుకు మించిన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. మొదటి సినిమా వెళ్లిపోమాకే నుంచి ఇప్పటివరకు విభిన్నమైన సినిమాలు, పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆద్యంతం ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఈ ఏడాది 'దాస్ కా ధమ్కీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు 6వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

అందులో రికార్డ్..
మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్, గ్లామరస్ బ్యూటి నివేదా పేతురాజ్ రెండోసారి జంటగా నటించిన చిత్రం 'దాస్ కా ధమ్కీ'. రావు రమేష్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, అజయ్, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను వన్మయే క్రియేషన్స్ బ్యానర్ పై సుమారు రూ. 20 కోట్లు బడ్జెట్ తో నిర్మించారు. దీంతో విశ్వక్ సేన్ సినీ కెరీర్ లో ఈ మూవీ భారీ బడ్జెట్ చిత్రంగా రికార్డుకెక్కింది.

ప్రీ రిలీజ్ బిజినెస్..
'ఫలక్ నుమా దాస్' సినిమా తర్వాత సుమారు నాలుగేళ్లకు 'దాస్ కా ధమ్కీ' చిత్రంతో మెగా ఫోన్ పట్టుకున్నాడు టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్. ఇది విశ్వక్ మూవీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రంగా విడుదలైంది. ఇక ఈ యంగ్ హీరో రేంజ్ కు తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్ లో రూ. 1 కోటి, ఆంధ్రాలో రూ. 3 కోట్లు కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 7 కోట్లు బిజినెస్ కాగా.. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు, అలాగే ఓవర్సీస్ కలుపుని మొత్తంగా రూ. 10 కోట్లుగా బిజినెస్ జరిగిందని సమాచారం.

థియేటర్ కౌంట్..
విశ్వక్ సేన్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే అమితమైన అభిమానం అని తెలిసిందే. అందుకే తన అభిమాని కోరిక మేరకు 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అలాగే ప్రమోషన్స్ లో నందమూరి నటసింహం బాలయ్య బాబు కూడా పాల్గొన్నారు. దీంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. అది ఎక్కువ థియేటర్స్ లలో విడుదల చేసేందుకు ఉపయోగపడింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 650 థియేటర్లలో రిలీజ్ చేశారు.

థియేటర్ ఆక్యుపెన్సీ..
విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'దాస్ కా ధమ్కీ' సాంగ్స్ విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక సినిమాలో నివేదా పేతురాజ్ గ్లామర్ ప్లస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే 'దాస్ కా ధమ్కీ' సినిమాకు 6వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ అంతకుముందు కంటే కాస్తా తగ్గినట్లు తెలుస్తోంది. ఉదయం షోలకు 30.11 శాతం, మధ్యాహ్నానికి 25.65 శాతం, ఇక సాయంత్రానికి పెరిగి 30.13 శాతంగా నమోదైనట్లు గణాంకాలు వెల్లడించాయి.

6వ రోజు కలెక్షన్స్..
'దాస్ కా ధమ్కీ' సినిమా విడుదలైన రోజు అంటే మార్చి 22న మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఇది విశ్వక్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అని విశ్లేషకులు తెలిపారు. ఇక ఈ సినిమాకు డిఫరెంట్ టాక్ వస్తోంది. అయినా కలెక్షన్స్ ఓకే అనిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి ఆరో రోజున రూ. 1.50 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అంటే వర్కింగ్ డే అయిన సోమవారం రోజున కూడా ధమ్కీకి ప్రేక్షకులు వెళ్లినట్లు అర్థం అవుతోంది.
6 రోజుల్లో వచ్చింది..
టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వం వహించడమే కాకుండా డ్యుయల్ రోల్ తో ఆకట్టుకున్న లేటెస్ట్ సినిమా 'దాస్ కా ధమ్కీ'. ఈ మూవీకి 6 రోజుల్లో రూ. 15.05 కోట్లు ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 9.56 కోట్లు షేర్‌తో పాటు రూ. 18.88 కోట్లు గ్రాస్ వసూలైనట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications











