Das Ka Dhamki 8 Days Collection: ఆ క్లబ్ లో చేరిన విశ్వక్ మూవీ.. మొత్తంగా ఎన్ని కోట్లు అంటే?

హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా సత్తా చాటుతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. మొదటిసారిగా ఫలక్​నూమా దాస్​ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న ఈ యంగ్ హీరో మరోసారి డైరెక్టర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సుమారు నాలుగేళ్ల తర్వాత విశ్వక్ డైరెక్ట్ చేసిన సినిమా 'దాస్ కా ధమ్కీ' ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదలైంది. అయితే ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వస్తున్న కలెక్షన్స్ మాత్రం బాగానే వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ధమ్కీ చిత్రానికి 8వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేస్తే..

 రికార్డ్..

రికార్డ్..

టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ తన తాజా సినిమా 'దాస్ కా ధమ్కీ'తో మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాను సుమారు రూ. 20 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా చూసుకుంటే విశ్వక్ సేన్ సినీ కెరీర్ లోనే 'దాస్ కా ధమ్కీ' మూవీ అత్యధిక బడ్జెట్ చిత్రంగా నిలిచి రికార్డ్ గా మారింది.

థియేటర్ కౌంట్..

థియేటర్ కౌంట్..

విశ్వక్ సేన్, బ్యూటిఫుల్ నివేదా పేతురాజ్ రెండోసారి జత కట్టిన 'దాస్ కా ధమ్కీ' సినిమాకు విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ అయింది. అంతకుమించి అన్నట్లుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రావడంతో సినిమాపై హైప్ పెరిగింది. అందుకే ఈ సినిమాను తెలంగాణలో 220 స్క్రీన్స్, ఆంధ్రప్రదేశ్ లో 220 థియేర్స్, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 210 సెంటర్స్ లో రిలీజ్ చేశారు. ఇక ఓవర్సీస్ తోపాటు వరల్డ్ వైడ్ గా కలుపుకుని 650 థియేటర్లలో విడుదల చేశారు.

ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

విశ్వక్ సేన్ రెండోసారి దర్శకత్వం వహించిన 'దాస్ కా ధమ్కీ' చిత్రానికి అతని మార్కెట్ కు తగినట్లుగానే ప్రీ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్ లో రూ. 1 కోటి, ఆంధ్రాలో రూ. 3 కోట్లు కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 7 కోట్లు బిజినెస్ చేసిందని సమాచారం. అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 80 లక్షలు కాగా.. ఓవర్సీస్ అంతా కలిపి మొత్తంగా రూ. 10 కోట్లుగా బిజినెస్ జరిగినట్లు విశ్లేషకులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో..

హైపర్ ఆది, రంగస్థలం మహేష్ వంటి కమెడియన్లు నటించిన విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పర్వాలేదనిపిస్తున్నాయి.

ఈ సినిమాకు 8వ రోజు నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్ లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, క్రృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలు వసూలు చేసింది. అంటే మొత్తంగా 8వ రోజు తెలంగాణ, ఆంధ్రాలో రూ. 41 లక్షల షేర్, రూ. 80 లక్షల గ్రాస్ సాధించింది.

8వ రోజు కలెక్షన్స్..

8వ రోజు కలెక్షన్స్..

విశ్వక్ సేన్ లేటెస్ట్ సినిమాకు టాక్ పరంగా ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం పర్వాలేదనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే 'దాస్ కా ధమ్కీ' చిత్రానికి 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో రూ. 3.63 కోట్లు, సీడెడ్ లో రూ. 1.19 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 66 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, గుంటూరులో రూ. 67 లక్షలు, క్రృష్ణాలో రూ. 55 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలు వచ్చింది. దీంతో 8 రోజుల్లో మొత్తంగా రూ. 8.39 కోట్లు షేర్, రూ. 15.45 కోట్లు గ్రాస్ అందుకుంది.

వరల్డ్ వైడ్ గా..

వరల్డ్ వైడ్ గా..

విశ్వక్ సేన్ మొదటి సారిగా ద్విపాత్రాభినయం చేసిన 'దాస్ కా ధమ్కీ' సినిమా తెలుగు రాష్టాల్లో 8 రోజుల్లో రూ. 8.39 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.16 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 1.27 కోట్లు సాధించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా 'దాస్ కా ధమ్కీ' మూవీకి రూ. 10.82 కోట్లు షేర్, రూ. 21.05 గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే 8 రోజులకి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మనీని విశ్వక్ సేన్ మూవీ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే రూ. 20 కోట్ల క్లబ్ లో గ్రాస్ కలెక్షన్స్ చేరాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X