Das Ka Dhamki Collection: విశ్వక్ కు దసరా షాక్.. పడిపోయిన కలెక్షన్స్.. వచ్చిందెంతో తెలిస్తే?

హీరో విశ్వక్ సేన్ మాస్ కా దాస్ గా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. గతేడాది ఓరి దేవుడా చిత్రంతో ఆడియెన్స్ మెప్పు పొందిన విశ్వక్ సేన్ ఈ ఏడాది దాస్ కా ధమ్కీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఉగాది పండుగ పురస్కరించుకుని మార్చి 22న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది. ఈ చిత్రానికి మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాగా.. 9వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాలపై ఓ లుక్ వేద్దాం.

రెస్పాన్స్ పరంగా..

రెస్పాన్స్ పరంగా..

విశ్వక్ సేన్ తాజా చిత్రం 'దాస్ కా ధమ్కీ' యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్ పై నిర్మించగా.. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. కాగా ఈ సినిమాను సుమారు రూ. 20 కోట్లతో విశ్వక్ సేన్ సినీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించారు. ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు రెస్పాన్స్ పర్వాలేదనిపిస్తోంది.

థియేటర్ కౌంట్..

థియేటర్ కౌంట్..

విభిన్న ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు హీరో విశ్వక్ సేన్. ఈ క్రమంలోనే 'దాస్ కా ధమ్కీ' సినిమాలో తొలిసారిగా డ్యూయెల్ రోల్ లో కనిపించాడు. దీంతో ఈ సినిమాకు ఒకరకమైన హైప్ వచ్చేసింది. ఇక ఈ సినిమాను తెలంగాణలో 220 స్క్రీన్స్, ఆంధ్రప్రదేశ్ లో 220 థియేటర్స్ లో, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 210 సెంటర్లలో రిలీజ్ చేశారు. ఇక ఓవర్సీస్ తోపాటు వరల్డ్ వైడ్ గా కలుపుకుని 650 థియేటర్లలో విడుదల చేశారు.

 ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

ఫలక్ నమా దాస్ మూవీ తర్వాత విశ్వక్ సేన్ రెండోసారి మెగా ఫోన్ పట్టుకున్న సినిమా 'దాస్ కా ధమ్కీ'. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్ లో రూ. 1 కోటి, ఆంధ్రాలో రూ. 3 కోట్లు కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 80 లక్షలు కాగా.. ఓవర్సీస్ అంతా కలిపి మొత్తంగా రూ. 10 కోట్లుగా బిజినెస్ జరిగినట్లు విశ్లేషకులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో..

విశ్వక్ సేన్ తో నివేదా పేతురాజ్ మరోసారి జోడీ కట్టిన చిత్రమే 'దాస్ కా ధమ్కీ' . ఈ సినిమాకు 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, క్రృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాలు కలిపి రూ. 20 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఇంతకుముందు రోజులతో పోల్చుకుంటే శుక్రవారం తక్కువగా కెలక్ట్ అయింది. అందుకు నాని దసరా మూవీ కారణంగా తెలుస్తోంది.

9 రోజుల వసూళ్లు..

9 రోజుల వసూళ్లు..

విశ్వక్ సేన్ లేటెస్ట్ సినిమా 'దాస్ కా ధమ్కీ'కి 9 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలోని నైజాంలో రూ. 3.69 కోట్లు, సీడెడ్ లో రూ. 1.21 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.04 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 68 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు, గుంటూరులో రూ. 69 లక్షలు, క్రృష్ణాలో రూ. 57 లక్షలు, నెల్లూరులో రూ. 31 లక్షలు వచ్చింది. దీంతో 9 రోజుల్లో మొత్తంగా రూ. 8.59 కోట్లు షేర్, రూ. 15.85 కోట్లు గ్రాస్ సాధించగలిగింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా..


విశ్వక్ సేన్ సెకండ్ డైరెక్టెడ్ మూవీ 'దాస్ కా ధమ్కీ' తెలుగు రాష్టాల్లో 9 రోజుల్లో రూ. 8.59 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.17 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 1.28 కోట్లు సాధించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా 'దాస్ కా ధమ్కీ' చిత్రానికి రూ. 11.04 కోట్లు షేర్, రూ. 21.50 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఫ్రైడే రోజున ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గినట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X