Das Ka Dhamki Day 3 Collection: సత్తా చాటుతున్న ధమ్కీ.. 3వ రోజు అన్ని కోట్లు.. బ్రేక్ ఈవెన్ పూర్తి!
వెళ్లిపోమాకే అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఆ తర్వాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది, ఫలక్నూమా దాస్ సినిమాలతో మాస్ ఆడియెన్స్ ను మెప్పించాడు. అనంతరం పాగల్ మూవీతో లవర్ బాయ్ అవతారం ఎత్తి మంచి హిట్ అందుకున్నాడు.
అశోకవనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా వంటి సినిమాలతో అలరించిన విశ్వక్ సేన్ ఈ ఈడాది 'దాస్ కా ధమ్కీ' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదలైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తున్న కలెక్షన్స్ మాత్రం బాగుంటున్నాయి. ఈ క్రమంలో ధమ్కీ చిత్రానికి 3వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

నాలుగేళ్ల తర్వాత..
ఫలక్ నూమా దాస్ చిత్రంతో డైరెక్టర్ గా మారాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో హీరోగాపాటు దర్శకత్వం వహించి సత్తా చాటాడు. ఇప్పుడు మరోసారి హీరోగా, డైరెక్టర్గా ఆకట్టుకునేందుకు ముందుకు వచ్చాడు. సుమారు నాలుగేళ్ల తర్వాత విశ్వక్ సేన్ మెగా ఫోన్ పట్టుకున్న చిత్రం 'దాస్ కా ధమ్కీ'. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రంలో బ్యూటిఫుల్ నివేదా పేతురాజ్ హీరోయిన్ గా అలరించింది.

అత్యధిక బడ్జెట్ తో..
మాస్ హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. అయితే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ తన లేటెస్ట్ మూవీ 'దాస్ కా ధమ్కీ'తో అటు మాస్, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను సుమారు రూ. 20 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లు సమాచారం. దీంతో విశ్వక్ సేన్ సినీ కెరీర్ లోనే ఈ మూవీ అత్యధిక బడ్జెట్ చిత్రంగా నిలిచింది.

ప్రీ రిలీజ్ బిజినెస్..
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'దాస్ కా ధమ్కీ' మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశాడు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ మార్కెట్ కు తగినట్లుగానే ప్రీ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్ లో రూ. 1 కోటి, ఆంధ్రాలో రూ. 2.8 కోట్లు కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 6.80 కోట్లు బిజినెస్ చేసింది.
అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి రూ. 70 లక్షల బిజినెస్ జరిగింది. దీంతో విశ్వక్ సేన్ సినిమాకు రూ. 7.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరగ్గా.. రూ. 8 కోట్లు బ్రేక్ ఈవెన్ నమోదు అయింది.

థియేటర్ ఆక్యుపెన్సీ..
విశ్వక్ సేన్ తాజా చిత్రం 'దాస్ కా ధమ్కీ'కి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ జరిగింది. ఇక థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు విభిన్నమైన టాక్ తో సాగుతోంది. ఈ క్రమంలో 'దాస్ కా ధమ్కీ' థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. ఉదయం షోలకు 26.50 శాతం, మధ్యాహ్నానికి 27.19 శాతం, ఇక సాయంత్రానికి పెరిగి 32.43 శాతంగా నమోదు అయినట్లు సమాచారం.

3వ రోజు కలెక్షన్స్..
'దాస్ కా ధమ్కీ' సినిమాకు మొదటి ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా మాస్ ఏరియాలలో ఈ సినిమాకు మంచి పాజిటివ్ బజ్ రావడంతో భారీ స్థాయిలోనే విడుదల చేశారు. మార్చి 22న విడుదలైన ఈ సినిమాకు బెస్ట్ ఓపెనింగ్స్ దక్కాయి. విశ్వక్ సేన్ సినిమాకు టాక్ పరంగా ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ క్రమంలో 'దాస్ కా ధమ్కీ' చిత్రానికి మూడవ రోజు రూ. 1.90 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

3 రోజుల్లో వచ్చింది..
విశ్వక్ సేన్ మొదటి సారిగా ద్విపాత్రాభినయం చేసిన 'దాస్ కా ధమ్కీ' సినిమాను పలువురు విమర్శిస్తున్నారు. ఇతర సినిమాల్లోని సన్నివేశాలు ఇందులో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇలాంటి టాక్ నడుస్తున్న కూడా కలెక్షన్లపరంగా మాత్రం విశ్వక్ లేటెస్ట్ మూవీ సత్తా చాటుతోంది. ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 9.20 ఇండియా నెట్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఇప్పటికే రెండు రోజుల్లో రూ. 5.53 షేర్ కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ సినిమాకు మరో రూ. 2 కోట్లు జతకానున్నాయి. దీంతో విడుదలైన నాలుగో రోజు షేర్ కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











