Das Ka Dhamki Pre Release Business: విశ్వక్ సేన్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంత.. ఎంత వస్తే హిట్ అంటే?
టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన యాక్టింగ్ డిఫరెంట్ గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఇక ఈసారి అతను డబల్ యాక్షన్ తో రాబోతున్నాడు. దాస్ కా ధమ్కీ అనే డిఫరెంట్ మాస్క్ కమర్షియల్ సినిమా ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు బిజినెస్ చేసింది? అలాగే తెలుగులో సక్సెస్ కావాలి అంటే ఎంత షేర్ కలక్షన్స్ అందుకోవాలి? బ్రేకింగ్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

మరోసారి ధమ్కీతో..
విశ్వక్ సేన్ ఇదివరకే డైరెక్షన్ తో కూడా మెప్పించి మంచి గుర్తింపునందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి అతను దాస్ కా ధమ్కీ అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సాంగ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అలాగే ఓవర్గం ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసింది.

పాజిటివ్ వైబ్రేషన్స్
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆస్కార్ ఈవెంట్ అనంతరం డైరెక్ట్ గా ఎన్టీఆర్ విశ్వక్ సేన్ సినిమా ఈవెంట్ లో పాల్గొనడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై మరింత ఫోకస్ పడింది. చాలామంది మాస్ ఆడియన్స్ ఈ సినిమా చూడాలని ఎంతో ఆతృతగా గా ఎదురు చూస్తున్నారు. ప్రమోషన్స్ విషయంలో అయితే విశ్వక్ పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశాడు.

తెలుగులోనే..
డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అసలైతే మొదట ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లుగా చిత్రీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రేంజ్ లో పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు. కేవలం తెలుగులోనే ఈ సినిమా ప్రమోషన్స్ కొనసాగుతున్నాయి.

ఏపీ నైజాం బిజినెస్
ఇక ధమ్కీ సినిమాకు సంబంధించిన బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలోనే విడుదలవుతోంది నైజంలో ఈ సినిమా 3 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయగా సీడెడ్ లో 1 కోటి, ఆంధ్రాలో 2.8 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇలా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా 6.80 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లుగా సమాచారం.

వరల్డ్ వైడ్ బిజినెస్
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో చూసుకుంటే దమ్కీ సినిమా 0.70 కోట్ల రేంజ్ లో అమ్ముడవగా.. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగులో ఈ సినిమాకు 7.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఒక విధంగా విశ్వక్ కెరీర్ లోనే ఇది కాస్త ఎక్కువ బిజినెస్ తోనే హడావిడి చేయబోతోంది.

టార్గెట్ ఎంత?
అంటే ఓవరాల్ గా సినిమా తెలుగులో సక్సెస్ కావాలి అంటే బాక్సాఫీస్ వద్ద 8 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో విశ్వక్ సేన్ సినిమాలలో ఏవి కూడా పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్ అయితే అందించింది లేదు. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ ధమ్కీ సినిమాపైనే ఉంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











