Ori Devuda Official Collections: 6 కోట్ల టార్గెట్.. వారంలో ఊహించని విధంగా.. ఇంకెంత వస్తే హిట్ అంటే!

టాలీవుడ్‌లోకి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అవుతున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపుతో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ఆరంభంలోనే మాస్ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ ఒకడు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ యంగ్ హీరో.. ఇటీవలే 'ఓరి దేవుడా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మంచి టాక్‌తో పాటు కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఓరి దేవుడా' మూవీ వారం రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

ఓరి దేవుడా మూవీ వచ్చిందిలా

ఓరి దేవుడా మూవీ వచ్చిందిలా

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో అశ్వత్ మరిముత్తు తీసిన చిత్రమే 'ఓరి దేవుడా'. ఇందులో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటించగా.. వెంకటేష్ కామియో రోల్‌ చేశారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై పరవ్ వీ పొట్లూరి నిర్మించారు. లియాన్ జేమ్స్ దీనికి సంగీతం ఇచ్చారు. ఈ మూవీ ఓ మై కడవులే అనే తమిళ చిత్రానికి రీమేక్‌గా రూపొందింది.

ఓరి దేవుడా బిజినెస్ వివరాలు

ఓరి దేవుడా బిజినెస్ వివరాలు


యంగ్ గాయ్ విశ్వక్ సేన్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే మార్కెట్ ఏర్పడుతుంది. దీనికితోడు అతడి తాజా చిత్రం 'ఓరి దేవుడా'పై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ అయింది. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో గ్రాండ్‌గా తీసుకు వచ్చారు.

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి రోజు రూ. 90 లక్షలు, రెండో రోజు రూ. 66 లక్షలు, మూడో రోజు రూ. 74 లక్షలు, నాలుగో రోజు రూ. 90 లక్షలు, ఐదో రోజు రూ. 39 లక్షలు, ఆరో రోజు రూ. 26 లక్షలు వచ్చాయి. ఇక ఏడో రోజు ఈ సినిమాకు రూ. 18 లక్షలు షేర్, 40 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

7 రోజులకు కలిపి ఎంతొచ్చింది

7 రోజులకు కలిపి ఎంతొచ్చింది


'ఓరి దేవుడా' మూవీ అంధ్రప్రదేశ్, తెలంగాణలో వారం రోజుల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 1.73 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో రూ. 46 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 1.84 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ మూవీ రూ. 4.03 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.90 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.03 కోట్లు వసూలు చేసిన విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 11 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 61 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.75 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.55 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో ఈ సినిమాకు రూ. 4.75 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.25 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X