Ori Devuda Official Collections: 2వ రోజు ఊహించని వసూళ్లు.. ఇంకెన్ని కోట్లు వస్తే హిట్ అంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంది యంగ్ హీరోలు సందడి చేస్తున్నారు. అందులో ఆరంభంలోనే మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. తనదైన శైలి చిత్రాలతో దూసుకుపోతోన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. మాస్ హీరోగా ముద్ర పడినా ఎప్పటికప్పుడు విభిన్నమైన చిత్రాలు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ యంగ్ హీరో 'ఓరి దేవుడా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు రెండు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో చూద్దాం పదండి!

ఓరి దేవుడా అంటూ వచ్చేశారు
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ - అశ్వత్ మరిముత్తు కాంబోలో వచ్చిన మూవీనే 'ఓరి దేవుడా'. ఇందులో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటించగా.. వెంకటేష్ కామియో రోల్ చేశారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై పరవ్ వీ పొట్లూరి నిర్మించారు. లియాన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆశా భట్, మురళీ శర్మ, రాహుల్ తదితరులు నటించారు.

ఓరి దేవుడా బిజినెస్ వివరాలు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు మార్కెట్ ఉంది. దీనికితోడు అతడి తాజా చిత్రం 'ఓరి దేవుడా'పై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు.

2వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 90 లక్షలు వసూలు అయ్యాయి. ఈ క్రమంలోనే రెండో రోజు దీనికి వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రానికి రెండో రోజు కేవలం రూ. 66 లక్షలే వచ్చాయి. ఒక రకంగా ఇది మంచి హోల్డ్ అని విశ్లేషకులు అంటున్నారు.

2 రోజులకు కలిపి ఎంతొచ్చింది
'ఓరి దేవుడా' మూవీ అంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండో రోజుల్లో ఓ మోస్తరు వసూళ్లనే రాబట్టింది. రెండు రోజులకు కలిపి ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 65 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో రూ. 18 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 73 లక్షలు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 1.56 కోట్లు షేర్‌తో పాటు రూ. 2.65 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 1.56 కోట్లు రాబట్టిన విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' మూవీ ప్రపంచ వ్యాప్తంగా నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 41 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 2 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.03 కోట్లు షేర్‌తో పాటు రూ. 3.65 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?
విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో ఈ సినిమాకు రూ. 2.03 కోట్లు వసూలు అయ్యాయి. అంటే మరో 3.97 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











