Ori Devuda Collections: పాజిటివ్ గా విశ్వక్ సేన్ ఓరి దేవుడా.. రెండో రోజు వచ్చేది ఎంతంటే!
తమిళంలో 2020లో విడుదలై సూపర్ హిట్ సాధించిన చిత్రం ఓ మై కడువలే. ఈ చిత్రానికి రీమేక్ గా తెలుగులో వచ్చిన చిత్రం ఓరి దేవుడా. విక్టరీ వెంకటేష్ దేవుడిగా, బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని సతమతమయ్యే అబ్బాయిగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించి ఆకట్టుకున్నారు. తమిళ మూవీ డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తునే ఈ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించారు. బ్యూటిఫుల్ హీరోయిన్లు మిథిలా పాల్కర్, ఆశా భట్ నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలైంది. పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తున్న ఓరి దేవుడా సినిమా రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

సినిమా బడ్జెట్ ఇలా..
అశోకవనంలో అర్జున కల్యాణం తర్వాత మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన చిత్రం ఓరి దేవుడా. ప్రముఖ నిర్మాత పీవీపీ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడదలై మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. రొమాంటిక్, లవ్, కామెడీ చిత్రంగా వచ్చిన ఓరి దేవుడా మూవీకి సుమారు రూ. 10 కోట్లుగా బడ్జెట్ నమోదైనట్లు సమాచారం.

ప్రీ రిలీజ్ బిజినెస్..
ఓరి దేవుడా చిత్రంలో విక్టరీ వెంకటేష్ దేవుడిగా, లాయర్ గెటప్ లో కనిపించి ఆకట్టుకోగా.. విశ్వక్ సేన్ నటన అలరించింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా రూ. 6 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. దీంతో రూ. 6.5 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా ఏర్పడింది.

తొలి రోజు వసూళ్లు..
ఓరి దేవుడా చిత్రం వరల్డ్ వైడ్ గా సాధించిన తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా ఈ మూవీ రూ. 1.5 కోట్ల షేర్, అమెరికా, ఇతర ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలు సాధించింది. దాంతో ఓరి దేవుడా సినిమా రూ. 2 కోట్ల మేర షేర్.. రూ. 4 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రెండో రోజు థియేటర్ ఆక్యుపెన్సీ..
విశ్వక్ సేన్ హీరోగా.. మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా అలరించిన ఓరి దేవుడా మూవీకి తొలి రోజు థియేటర్ ఆక్యుపెన్సీ పర్వాలేదనిపించింది. ఇక రెండో రోజు ఉదయం 16.75 శాతంగా, మధ్యాహ్నాం 21.66 శాతంగా ఆక్యుపెన్సీ నమోదు అయింది. అంటే మొత్తంగా ఓరి దేవుడా చిత్రానికి రెండో రోజు మధ్యాహ్నాం వరకు 38.41 శాతంగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

రెండో రోజు కలెక్షన్ల అంచనా..
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన చిత్రం ఓరి దేవుడా. తలరాతను రాసిన దేవుడే వచ్చి మళ్లీ తల రాతను రాసుకోమ్మని ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపిస్తోంది. తాజాగా అందిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా రెండో రోజు రూ. 1 కోటి కలెక్షన్లు రాబట్టొచ్చని తెలుస్తోంది. ఇక రెండు రోజులకు కలుపుకుని రూ. రూ. 2.5 కోట్లకు అటు ఇటుగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











