Ori Devuda Official Collections: విశ్వక్‌కు కలిసొచ్చిన దీపావళి.. 4వ రోజు భారీగా.. ఇంకెంత రావాలంటే!
టాలీవుడ్‌లోకి ఎంతో మంది యంగ్ హీరోలు వస్తున్నారు. కానీ అందులో చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయిన వాళ్లు కొంత మందే ఉంటున్నారు. ఈ కోవలోకే వస్తాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చిన అతడు.. తనదైన శైలి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తద్వారా హిట్లను అందుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. దీంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఓరి దేవుడా' అనే చిత్రంతో వచ్చాడు. క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీకి నాలుగు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో చూద్దాం పదండి!

ఓరి దేవుడా అంటున్న విశ్వక్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా అశ్వత్ మరిముత్తు రూపొందించిన చిత్రమే 'ఓరి దేవుడా'. ఇందులో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటించగా.. వెంకటేష్ కామియో రోల్ చేశారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై పరవ్ వీ పొట్లూరి నిర్మించారు. లియాన్ జేమ్స్ దీనికి సంగీతం అందించారు. ఆశా భట్, మురళీ శర్మ, రాహుల్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

ఓరి దేవుడా బిజినెస్ వివరాలు
యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు మార్కెట్ ఉంది. దీనికితోడు అతడి తాజా చిత్రం 'ఓరి దేవుడా'పై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

4వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీకి మంచి టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 90 లక్షలు వసూలు అయ్యాయి. ఆ తర్వాత రెండో రోజు కాస్త తగ్గి రూ. 66 లక్షలు వచ్చాయి. మూడో రోజు కొంచె పెరిగి రూ. 74 లక్షలు వసూలు అయ్యాయి. ఈ క్రమంలోనే దీపావళి హాలీడే ఉన్న నాలుగో రోజు దీనికి మళ్లీ పెరిగి రూ. 90 లక్షలు కలెక్ట్ అయ్యాయి.

4 రోజులకు కలిపి ఎంతొచ్చింది
అంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ఓరి దేవుడా' మూవీ నాలుగు రోజుల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 1.34 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో రూ. 38 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 1.49 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 3.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 5.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు వసూలు చేసిన విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 54 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.82 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.85 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?
మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో ఈ సినిమాకు రూ. 3.82 కోట్లు వచ్చాయి. అంటే మరో 2.18 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.


Click it and Unblock the Notifications











