Ori Devuda Official Collections: విశ్వక్‌కు బిగ్ షాక్.. భారీగా పడిన వసూళ్లు.. అన్ని కోట్లు వస్తేనే!
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఆరంభంలోనే పలు విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. క్రమంగా ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా పెంచుకుంటోన్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే విశ్వక్ 'ఓరి దేవుడా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లవ్ అండ్ ఎమోషనల్ కాన్సెప్టుతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా ఐదు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూడండి!

ఓరి దేవుడా అంటూ వచ్చాడుగా
యంగ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో అశ్వత్ మరిముత్తు తీసిన చిత్రమే 'ఓరి దేవుడా'. ఇందులో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటించగా.. వెంకటేష్ కామియో రోల్ చేశారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై పరవ్ వీ పొట్లూరి నిర్మించారు. లియాన్ జేమ్స్ దీనికి సంగీతం ఇచ్చారు. ఆశా భట్, మురళీ శర్మ, రాహుల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఓరి దేవుడా బిజినెస్ వివరాలు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే మార్కెట్ ఏర్పడుతుంది. దీనికితోడు అతడి తాజా చిత్రం 'ఓరి దేవుడా'పై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ అయింది. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు.

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దీనికి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా మొదటి రోజు రూ. 90 లక్షలు, రెండో రోజు కాస్త తగ్గి రూ. 66 లక్షలు, మూడో రోజు కొంచె పెరిగి రూ. 74 లక్షలు, నాలుగో రోజు రూ. 90 లక్షలు కలెక్ట్ అయ్యాయి. ఇక, ఐదో రోజు దీనికి రూ. 39 లక్షలు షేర్, 65 లక్షలు గ్రాస్ వచ్చింది.

5 రోజులకు కలిపి ఎంతొచ్చింది
అంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ఓరి దేవుడా' మూవీ ఐదు రోజుల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 1.55 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో రూ. 41 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 1.63 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 3.59 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.15 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.59 కోట్లు వసూలు చేసిన విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 57 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.25 కోట్లు షేర్‌తో పాటు రూ. 7.60 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో ఈ సినిమాకు రూ. 4.25 కోట్లు వచ్చాయి. అంటే మరో 1.75 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











