Ori Devuda Official Collections: విశ్వక్‌కు బిగ్ షాక్.. 8వ రోజు ఘోరంగా.. హిట్ అవ్వాలంటే మాత్రం!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని.. వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న అతడు.. ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. దీనికి మంచి టాక్ ఉన్నా కలెక్షన్లు డౌన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ఓరి దేవుడా' మూవీ ఎనిమిది రోజుల రిపోర్టును మీరే చూసేయండి!

ఓరి దేవుడా అంటూ వచ్చాడు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా అశ్వత్ మరిముత్తు తెరకెక్కించిన క్రేజీ మూవీనే 'ఓరి దేవుడా'. ఇందులో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటించగా.. వెంకటేష్ కామియో రోల్ చేశారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై పరవ్ వీ పొట్లూరి నిర్మించారు. లియాన్ జేమ్స్ దీనికి సంగీతం ఇచ్చారు. ఈ మూవీ ఓ మై కడవులే అనే తమిళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది.

ఓరి దేవుడా బిజినెస్ వివరాలు
విశ్వక్ సేన్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు అతడి తాజా చిత్రం 'ఓరి దేవుడా'పై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ అయింది. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు.

8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి రోజు రూ. 90 లక్షలు, రెండో రోజు రూ. 66 లక్షలు, మూడో రోజు రూ. 74 లక్షలు, నాలుగో రోజు రూ. 90 లక్షలు, ఐదో రోజు రూ. 39 లక్షలు, ఆరో రోజు రూ. 26 లక్షలు, ఏడో రోజు రూ. 18 లక్షలు వచ్చాయి. ఇక 8వ రోజు మాత్రం రూ. 9 లక్షలే రాబట్టింది.

8 రోజులకు కలిపి ఎంతొచ్చింది
అంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ఓరి దేవుడా' మూవీ 8 రోజుల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 1.76 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో రూ. 47 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 1.89 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని ఈ మూవీ రూ. 4.12 కోట్లు షేర్‌తో పాటు రూ. 7.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.12 కోట్లు వసూలు చేసిన విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 11 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 62 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.85 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.75 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?
విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. ఇక, ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు రూ. 4.85 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.15 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











