Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
HIT movie collections: రెండో రోజూ అదే జోరు.. ఏ ఏరియాలో ఎంత కొల్లగొట్టిందంటే..?
విభిన్న చిత్రాల్లో నటిస్తూ అభిమాన గణాన్ని సంపాదించుకున్న నాని.. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నాడు. నిర్మాతగా మారి తెరకెక్కించిన మొదటి చిత్రం అ! జాతీయ అవార్డును అందుకోగా.. రెండో చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మొదటి ఆట నుంచి పాజటిక్ టాక్ రావడంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. మొదటి రోజే షాకింగ్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక రెండో రోజూ అదే జోరును కొనసాగించింది. ఓ సారి ఆ వివరాలను చూద్దాం.
మొదటి రోజు ఎంతంటే..?
శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ చిత్రం సూపర్ హిట్ నిలవబోతోంది. ఈ చిత్రం మొదటి రోజే 1.32కోట్ల గ్రాస్‌ను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాబట్టినట్టు తెలుస్తోంది. ఇదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. 1.67కోట్ల మేరకు కొల్లగొట్టింది.
ఇక రెండో రోజూ అదే జోరు..
మొదటి ఆట అయ్యాక వచ్చి టాక్‌తో థియేటర్లన్నీ జనసందోహంగా మారడంతో కలెక్షన్లలోగ్రాఫ్ పెరగుతూనే వచ్చింది. ఆ తేడా కలెక్షన్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం రెండో రోజూ 1.09 కోట్ల మేర రాబట్టగా..మొత్తం రెండు రోజుల్లో 2.41కోట్లు కలెక్ట్ చేసింది.
ఏ ఏరియాలో ఎంతంటే..?
రెండో రోజు హిట్ చిత్రం ఏ ఏరియాలో ఎంత కొల్లగొట్టిందో ఓ సారి చూద్దాం. నైజాంలో 67 లక్షలు, సీడెడ్‌లో 9లక్షలు, ఉత్తరాంద్రలో 5లక్షలు, ఈస్ట్ 5లక్షలు, వెస్ట్ 5లక్షలు, గుంటూరు 4లక్షలు, కృష్ణా 5లక్షలు, నెల్లూరు 3లక్షలు ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.09కోట్లను కొల్లగొట్టింది. రెండు రోజుల్లో 2.41కోట్లు రాబట్టగా.. మరో 1.19కోట్లను కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని తెలుస్తోంది. అంటే ఆదివారం కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ కొట్టేయబోతోందన్న మాట.
HIT ప్రీ రిలీజ్ బిజినెస్
హిట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విశేషాలేంటో ఓ సారి చూద్దాం. నైజాం థియేట్రికల్ హక్కులు రూ.1.4 కోట్లు, సీడెడ్‌లో రూ.40 లక్షలు, ఆంధ్రాలో రూ.1.80 కోట్లు మేరకు అమ్ముడుపోయాయి. దీంతో ఏపీ, తెలంగాణలో ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ.3.60 కోట్లు పలికింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు రూ.20 లక్షలు, ఓవర్సీస్లో రూ.60 లక్షలతో వరల్డ్ వైడ్ బిజినెస్ రూ.4.40 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.