Das Ka Dhamki Collections: మరింత పడిపోయిన వసూళ్లు.. 10 రోజుల్లో మాత్రం అన్ని కోట్లు.. లాభం ఎంతంటే!

టాలీవుడ్‌లోకి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అవుతోన్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఒకడు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న అతడు.. ఇటీవలే స్వీయ దర్శకత్వంలో 'దాస్ కా ధమ్కీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే టాక్‌తో సంబంధం లేకుండా స్పందన వస్తోంది. కానీ, పదో రోజు పడిపోయాయి. ఈ నేపథ్యంలో 'దాస్ కా ధమ్కీ' 10 రోజుల రిపోర్టును చూడండి!

ధమ్కీ ఇచ్చేందుకు వచ్చాడు

ధమ్కీ ఇచ్చేందుకు వచ్చాడు

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించి, తెరకెక్కించిన మాస్ యాక్షన్ చిత్రమే 'దాస్ కా ధమ్కీ'. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన దీనికి లియాన్ జేమ్స్ దీనికి సంగీతం అందించారు. ఇందులో అక్షర గౌడ, రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

ధమ్కీ ప్రీ బిజినెస్ వివరాలు

ధమ్కీ ప్రీ బిజినెస్ వివరాలు

'దాస్ కా ధమ్కీ' మూవీపై అంచనాలు, విశ్వక్ సేన్ మార్కెట్‌ కారణంగా.. ఇది నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 2.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 100 లక్షలతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 10.50 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.

10వ రోజు ఎంత రాబట్టింది?

10వ రోజు ఎంత రాబట్టింది?

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, దీనికి ఏమాత్రం సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఇది టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది. రెండో వారం మాత్రం వసూళ్లు డౌన్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే పదో రోజు దీనికి కేవలం రూ. 14 లక్షలు మాత్రమే వచ్చాయి.

10 రోజుల్లో ఎంత రాబట్టింది?

10 రోజుల్లో ఎంత రాబట్టింది?

'దాస్ కా ధమ్కీ'కి పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.76 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.23 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.05 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 69 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 70 లక్షలు, కృష్ణాలో రూ. 59 లక్షలు, నెల్లూరులో రూ. 32 లక్షలతో కలిపి.. రూ. 8.73 కోట్లు షేర్, రూ. 16.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి పది రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 8.73 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.18 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.28 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 10 రోజుల్లోనే ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 11.19 కోట్లు షేర్‌తో పాటు రూ. 21.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, పది రోజుల్లో దీనికి రూ. 11.19 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు దీనికి రూ. 3.19 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X