Das Ka Dhamki Collections: బలగం కంటే తక్కువగా ధమ్కీ కలెక్షన్స్.. దసరా దెబ్బకు 11వ రోజు మరింత డౌన్!

టాలెంటెడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమా విడుదలకు ముందే మంచి పాజిటివ్ హైప్ క్రియేట్ చేసుకుంది. మార్చి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు ఊహించని స్థాయిలో కలెక్షన్లు అందుకుంది. ఇక ఆ తరువాత రోజు నుంచి నెంబర్స్ మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. అసలు ఈ స్థాయిలో కలెక్షన్స్ తగ్గుతాయని ఎవరు ఊహించలేదు. ఇక దసరా సినిమాకు 11వ రోజు అయితే బలగం సినిమా కంటే తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇక దసరా దెబ్బ కూడా గట్టిగానే పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మొదట్లో హడావుడి

మొదట్లో హడావుడి

మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధమ్కీ సినిమా మొదటి రెండు రోజుల్లో అయితే బాక్సాఫీస్ వద్ద బాగానే హడావిడి చేసింది. ఈ సినిమాను విశ్వక్ దర్శకత్వంలోనే తెరపైకి తీసుకురావడం జరిగింది. ఇక సినిమా ఓవర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోయింది. మొత్తానికి ప్రాఫిట్ లోకి అయితే వచ్చింది కానీ ఆ తర్వాత ఎక్కువ స్థాయిలో లాభాలను అందించడంలో విఫలమయింది.

ధమ్కీ ప్రీ రిలీజ్ బిజినెస్

ధమ్కీ ప్రీ రిలీజ్ బిజినెస్

'దాస్ కా ధమ్కీ' సినిమా డిమాండ్ కు తగ్గట్టుగా నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 2.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 100 లక్షలతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 10.50 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.

11వ రోజు ఎంత రాబట్టింది?

11వ రోజు ఎంత రాబట్టింది?

ధమ్కీ సినిమాకు మొదటి వారం తర్వాత కలెక్షన్స్ చాలా వరకు తగ్గుతూ వచ్చాయి. ఇక ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పదవరోజు కేవలం 14 లక్షలు మాత్రమే అందుకోగా.. 11వ రోజు 16 లక్షలు సొంతం చేసుకుంది. ఒక విధంగా ఇది 30 రోజుల క్రితం వచ్చిన బలగం సినిమా కంటే తక్కువ నెంబర్స్ అని చెప్పవచ్చు. ఈ సినిమాపై లేటెస్ట్ మూవీ దసరా ప్రభావం కూడా గట్టిగానే చూపించినట్లుగా తెలుస్తోంది.

నైజాం, ఏపీ 11 రోజుల లెక్క

నైజాం, ఏపీ 11 రోజుల లెక్క

'దాస్ కా ధమ్కీ'కి 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఇక నైజాంలో రూ. 3.82 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.07 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 70 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, గుంటూరులో రూ. 7ఖ్ లక్షలు, కృష్ణాలో రూ. 61 లక్షలు, నెల్లూరులో రూ. 33 లక్షలతో కలిపి...ఏపి నైజాంలో రూ. 8.89 కోట్లు షేర్, రూ. 16.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

వరల్డ్ వైడ్ టోటల్

వరల్డ్ వైడ్ టోటల్

విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' సినిమా 11 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 8.89 కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.19 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.29 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లోనే ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 11.37 కోట్లు షేర్‌తో పాటు రూ. 22.25 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రాఫిట్స్ ఎంతంటే?

ప్రాఫిట్స్ ఎంతంటే?

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'దాస్ కా ధమ్కీ' సినిమా అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా ఫిక్స్ అయ్యింది. ఇక, 11 రోజుల్లో సినిమా రూ. 11.37 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు దీనికి రూ. 3.37 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X