Das Ka Dhamki Collections: 8 కోట్ల టార్గెట్.. వారంలోనే అన్ని కోట్లు.. విశ్వక్‌కు లాభం ఎంతో తెలిస్తే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తూ వస్తున్న అతడు.. ఈ క్రమంలోనే ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో 'దాస్ కా ధమ్కీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే టాక్‌తో సంబంధం లేకుండా స్పందన వస్తోంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'దాస్ కా ధమ్కీ' మూవీ 7 రోజుల రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

ధమ్కీ అంటూ వచ్చిన విశ్వక్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ చిత్రమే 'దాస్ కా ధమ్కీ'. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన దీనికి లియాన్ జేమ్స్ దీనికి సంగీతం అందించారు. ఇందులో అక్షర గౌడ, రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ధమ్కీ ప్రీ బిజినెస్ వివరాలు
విశ్వక్ సేన్ మార్కెట్, 'దాస్ కా ధమ్కీ' మూవీపై అంచనాలు భారీగా ఉండడంతో.. ఇది నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 2.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 70 లక్షలతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 7.50 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

7వ రోజు ఎంత రాబట్టింది?
తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు 'దాస్ కా ధమ్కీ' మూవీ వసూళ్లు కాస్త పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 32 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

వారంలో ఎంత రాబట్టింది?
'దాస్ కా ధమ్కీ'కి వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 98 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, గుంటూరులో రూ. 63 లక్షలు, కృష్ణాలో రూ. 50 లక్షలు, నెల్లూరులో రూ. 28 లక్షలతో కలిపి.. రూ. 7.98 కోట్లు షేర్, రూ. 14.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
వారం రోజుల్లో విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో రూ. 7.98 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.12 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లోనే ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 10.35 కోట్లు షేర్‌తో పాటు రూ. 20.10 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 10.35 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు దీనికి రూ. 2.35 కోట్లు లాభాలు దక్కాయి.

వారంలో రచ్చ.. ఆ మార్కు
విశ్వక్ సేన్ - నివేదా పేతురాజ్ జంటగా నటించిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన దక్కుతూనే ఉంది. దీంతో వారం రోజుల్లోనే ఈ సినిమా రూ. 20 కోట్లు గ్రాస్, రూ. 10 కోట్లు షేర్ మార్కును చేరుకుంది. అలాగే, రెండు కోట్ల రూపాయల లాభాల మైలురాయినీ దాటేసింది. ఇలా వారంలోనే ఈ చిత్రం ఎన్నో రికార్డులను నమోదు చేసి సత్తా చాటుకుంది.


Click it and Unblock the Notifications











