Das Ka Dhamki Collections: విశ్వక్ ఊచకోత.. 3 రోజుల్లోనే అన్ని కోట్లు.. హిట్‌కు ఎంత దూరంలో ఉన్నాడంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా పాపులర్ హీరోగా సత్తా చాటుతోన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్య సరైన హిట్ కోసం చూస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు తన స్వీయ దర్శకత్వంలోనే విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీకి భారీ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో 'ధమ్కీ' మూవీ 3 రోజుల రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

దాస్ కా ధమ్కీ అన్న విశ్వక్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ మాస్ మూవీనే 'దాస్ కా ధమ్కీ'. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన దీనికి లియాన్ జేమ్స్ దీనికి సంగీతం అందించారు. ఇందులో అక్షర గౌడ, రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ధమ్కీ ప్రీ బిజినెస్ వివరాలు
'దాస్ కా ధమ్కీ' మూవీపై అంచనాలు ఉండడంతో పాటు విశ్వక్ సేన్ మార్కెట్ కారణంగా నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 2.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 70 లక్షలతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 7.50 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

3వ రోజు ఎంత రాబట్టింది?
'దాస్ కా ధమ్కీ' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజూ సత్తా చాటుకుంది. ఫలితంగా నైజాంలో రూ. 58 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 1.02 కోట్లు షేర్, రూ. 1.80 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

3 రోజుల్లో ఎంత రాబట్టింది?
3 రోజుల్లో 'దాస్ కా ధమ్కీ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 73 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 64 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 49 లక్షలు, కృష్ణాలో రూ. 33 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో కలిపి.. రూ. 5.13 కోట్లు షేర్, రూ. 9.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 5.13 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 76 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 97 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మూడు రోజుల్లోనే ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 6.86 కోట్లు షేర్‌తో పాటు రూ. 13.55 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 6.86 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.14 కోట్లు వస్తే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

వీకెండ్‌లోనే లాభాల బాటలో
విశ్వక్ సేన్ - నివేదా పేతురాజ్ జంటగా రూపొందిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన దక్కుతూనే ఉంది. దీంతో మూడు రోజుల్లోనూ ఈ చిత్రం రూ. కోటి మార్కును దాటేసింది. ఇలా ఇప్పటికే ఆరు కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం వీకెండ్‌లోనే లాభాల బాటలో పయనించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











