Das Ka Dhamki Collections: విశ్వక్‌కు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు.. లాభం మాత్రం అన్ని కోట్లు
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది యంగ్ హీరోలు హడావిడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. విలక్షణమైన నటనతో విభిన్నమైన చిత్రాలు చేస్తోన్న ఈ యంగ్ టాలెంటెడ్ గాయ్.. తాజాగా 'దాస్ కా ధమ్కీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దీనికి టాక్‌తో సంబంధం లేకుండా స్పందన వస్తుండడంతో వసూళ్లు కూడా పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'దాస్ కా ధమ్కీ' మూవీ 6 రోజుల రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

ధమ్కీ ఇచ్చేందుకు వచ్చాడు
యంగ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ మూవీనే 'దాస్ కా ధమ్కీ'. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన దీనికి లియాన్ జేమ్స్ దీనికి సంగీతం అందించారు. ఇందులో అక్షర గౌడ, రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ధమ్కీ ప్రీ బిజినెస్ వివరాలు
విశ్వక్ సేన్ మార్కెట్‌తో పాటు 'దాస్ కా ధమ్కీ' మూవీపై అంచనాలు ఉండడంతో.. ఇది నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 2.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 70 లక్షలతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 7.50 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.

6వ రోజు ఎంత రాబట్టింది?
తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు 'దాస్ కా ధమ్కీ' మూవీ వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 13 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 30 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

6 రోజుల్లో ఎంత రాబట్టింది?
'దాస్ కా ధమ్కీ' మూవీకి 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 94 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 60 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 60 లక్షలు, కృష్ణాలో రూ. 46 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో కలిపి.. రూ. 7.66 కోట్లు షేర్, రూ. 14.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 7.66 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.08 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.21 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 6 రోజుల్లోనే ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 9.95 కోట్లు షేర్‌తో పాటు రూ. 19.35 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?
విశ్వక్ సేన్ హీరోగా నటించి, తెరకెక్కించిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 9.95 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు ఈ చిత్రానికి రూ. 1.95 కోట్లు లాభాలు దక్కాయి.

బిగ్ షాక్.. లాభాలతో హవా
విశ్వక్ సేన్ - నివేదా పేతురాజ్ కలయికలో రూపొందిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన దక్కుతూనే ఉంది. అయితే, వర్కింగ్ డే అయిన ఆరో రోజు మాత్రం ఈ చిత్రానికి బిగ్ షాక్ తగిలింది. ఫలితంగా ఈ మూవీకి కేవలం రూ. 30 లక్షలే వచ్చాయి. అయితే, లాభాల పరంగా మాత్రం ఇప్పటికే దీనికి రూ. 2 కోట్ల వరకూ లాభాలు సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











