Das Ka Dhamki Collections: ధమ్కీకి భారీ వసూళ్లు.. తొలిరోజే అన్ని కోట్లు.. విశ్వక్ ఆల్‌టైం రికార్డు

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది యంగ్ హీరోలు సందడి చేస్తున్నారు. కానీ, అందులో ఆరంభం నుంచే తనదైన రీతిలో హడావిడి చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అయితే, ఈ మధ్య కాలంలో సరైన హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా.. సఫలం మాత్రం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతడే స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన చిత్రమే'దాస్ కా ధమ్కీ'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తొలి రోజే సత్తా చాటింది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్ డే రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

ధమ్కీ ఇచ్చేందుకు వచ్చాడు

ధమ్కీ ఇచ్చేందుకు వచ్చాడు

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన మాస్ మూవీనే 'దాస్ కా ధమ్కీ'. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన దీనికి లియాన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో అక్షర గౌడ, రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

ధమ్కీ ప్రీ బిజినెస్ వివరాలు

ధమ్కీ ప్రీ బిజినెస్ వివరాలు


విశ్వక్ సేన్ మార్కెట్‌‌తో పాటు 'దాస్ కా ధమ్కీ' మూవీపై అంచనాలు ఉండడంతో.. నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 2.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 70 లక్షలతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 7.50 కోట్ల బిజినెస్ చేసింది.

అలాంటి టాక్... వసూళ్లు ఇలా

అలాంటి టాక్... వసూళ్లు ఇలా

ఎన్నో అంచనాల నడుమ రూపొందిన 'దాస్ కా ధమ్కీ' మూవీ ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా ఏవరేజ్‌గానే వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువగానే వసూళ్లు దక్కుతాయని విశ్లేషకులు అంచనా వేశారు.

తొలి రోజు ఎంత రాబట్టింది?

తొలి రోజు ఎంత రాబట్టింది?


'దాస్ కా ధమ్కీ' మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే భారీ వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 91 లక్షలు, సీడెడ్‌లో రూ. 43 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 40 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 30 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 40 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో కలిపి.. రూ. 3.06 కోట్లు షేర్, రూ. 5.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 3.06 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 40 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 62 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 4.08 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.88 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?


విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 4.08 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 3.92 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

విశ్వక్ కెరీర్‌లోనే టాప్ మూవీ

విశ్వక్ కెరీర్‌లోనే టాప్ మూవీ


విశ్వక్ సేన్ - నివేదా పేతురాజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'దాస్ కా ధమ్కీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే రూ. 4.08 కోట్లు షేర్, రూ. 8.88 కోట్లు గ్రాస్ వచ్చినట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించారు. తద్వారా అతడి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ఇది రికార్డును సాధించింది. ఇక, ఇది ఈ వీకెండ్‌లోనే టార్గెట్‌ను చేరే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X