Das Ka Dhamki Collections: నెగిటివ్ టాక్ వచ్చిన ఆ స్థాయిలో కలెక్షన్స్.. లాభాల్లోకి రావాలంటే ఇంకా అంత రావాలి!
విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్న యువ హీరో విశ్వక్ సేన్ ఇప్పుడు మాస్ హీరోగా కూడా తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. ఇక విశ్వక్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన దాస్ కా ధమ్కీ సినిమా ఉగాది పండుగ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజే విశ్వక్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇక రెండవ రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అలాగే లాభాల్లోకి రావాలి అంటే ఇంకా ఏ స్థాయిలో రాబట్టాలి అనే వివరాల్లోకి వెళితే..

పాజిటివ్ వైబ్రేషన్స్
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన దాస్ కా ధమ్కీ సినిమాపై మొదట్లోనే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో విశ్వక్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు. ఒకవైపు కామెడీ పండిస్తూనే మరొకవైపు మాస్ హీరోగా యాక్షన్ సీన్స్ లో కూడా అద్భుతంగా నటించాడు అనే విధంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా మ్యూజిక్ కూడా ముందుగానే మంచి బజ్ క్రియేట్ చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక ముందుగానే ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడడంతో మార్కెట్లో కూడా చెప్పుకోదగ్గ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఒక విధంగా విశ్వక్ కెరీర్ లోనే ఇది బెస్ట్ బిజినెస్ డీల్స్ అని చెప్పవచ్చు. నైజంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 2.80 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 70 లక్షలతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 7.50 కోట్ల బిజినెస్ చేసింది.

రెండవ రోజు కలెక్షన్స్
విశ్వక్ హీరోగా నటించడమే కాకుండా తనే డైరెక్షన్ చేసిన 'దాస్ కా ధమ్కీ' మూవీ ఉగాదికి గ్రాండ్ గా విడుదలైంది. సినిమా టాక్ అటు ఇటుగా ఉన్నా ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండవ రోజు కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 56 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 1 కోటికి పైగా షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్
విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' మూవీకి ఆంధ్రా, నైజాం మొదటి రోజు రూ. 3.06 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇక రెండవ రోజు కోటికి పైగా షేర్ రాగా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 60 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 82 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 5.53 కోట్లు షేర్‌తో పాటు రూ. 11 కోట్లు గ్రాస్ వసూలైనట్లు తెలుస్తోంది.

లాభాల్లోకి రావాలి అంటే..
విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' సినిమా విడుదలకు ముందు పెంచుకున్న బజ్ కు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. అయితే రెండు రోజుల్లో ఈ సినిమాకు రూ. 5.53 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక మరో రూ. 2.47 కోట్ల షేర్ వస్తేనే ఈ సినిమా హిట్టయినట్లు లెక్క.


Click it and Unblock the Notifications











