Das Ka Dhamki Collections: 4వ రోజు టార్గెట్ పూర్తి చేసిన విశ్వక్ సేన్.. ఇక వచ్చేవన్ని లాభాలే..
యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకుంటున్న విశ్వక్ సేన్ మాస్ హీరోగా కూడా నిలదొక్కుకోవాలి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన దాస్ కా ధమ్కీ సినిమా ఉగాది పండుగ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఈ హీరో కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇక 4వ రోజు ధమ్కీ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అలాగే లాభాల్లోకి రావాలి అంటే ఇంకా ఏ స్థాయిలో రాబట్టాలి అనే వివరాల్లోకి వెళితే..

విశ్వక్ మాస్ హిట్
దాస్ కా ధమ్కీ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులలో ఒక పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేసింది. ప్రతీ సినిమాతో ఏదో ఒక విధంగా కొత్తగా ఆకట్టుకుంటున్న విశ్వక్ ఈసారి కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా దాస్ కా ధమ్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉగాది రోజు విడుదలైన ధమ్కీ కొంత నెగిటివ్ టాక్ అందుకున్నప్పటికి మంచి కలెక్షన్స్ అందుకుంది. సినిమాలో విశ్వక్ ఒకవైపు కామెడీ పండిస్తూనే మరొకవైపు మాస్ హీరోగా యాక్షన్ సీన్స్ లో కూడా అద్భుతంగా నటించాడు.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..
దాస్ కా ధమ్కీ విడుదలకు ముందే రెండు ట్రైలర్స్ విడుదల చేసి ప్రేక్షకులలో అంచనాలు పెంచేశారు. ఇక విడుదలైన సాంగ్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడడంతో మార్కెట్లో కూడా చెప్పుకోదగ్గ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. నైజంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 2.80 కోట్ల మేర బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.80 కోట్ల బిజినెస్ చేయగా.. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 70 లక్షలతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 7.50 కోట్ల బిజినెస్ చేసింది.

4వ రోజు కలెక్షన్స్
విశ్వక్ సేన్ దర్శకత్వంలోనే వచ్చిన ఈ సినిమా టాక్ ను బట్టి పెద్దగా ఓపెనింగ్స్ రాకపోవచ్చని అందరూ అనుకున్నారు. రివ్యూలు తక్కువగా వచ్చినా కూడా నెంబర్స్ మాత్రం తగ్గలేదు. 4వ రోజు ఏపి నైజాం కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 64 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 1.22 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్
విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' సినిమా ఆంధ్రా, నైజాంలో 3 వ రోజు రూ. 1.02 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇక 4వ రోజు కోటికి పైగా షేర్ రాగా.. 4 రోజుల్లో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 92 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 8.37 కోట్లు షేర్‌తో పాటు రూ. 16.40 కోట్లు గ్రాస్ వసూలైనట్లు తెలుస్తోంది.

టార్గెట్ ఫినిష్
విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' సినిమా మొత్తానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేసింది. బజ్ కు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ చేయగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లకు ఫిక్స్ అయ్యింది. అయితే 4 రోజుల్లో ఈ సినిమా టార్గెట్ ను పూర్తి చేసింది. మొత్తంగా 8 కోట్లకు పైగా షేర్ తో కొనసాగుతున్న ధమ్కీ మిగిలిన రోజుల్లో మరింత కలెక్షన్స్ అందుకుంటే బయ్యర్లకు పండగే అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











