Das Ka Dhamki Collections: 5వ రోజు మరింత పెరిగిన కలెక్షన్స్.. ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్స్ ఎంతంటే?

యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ఉగాది సందర్భంగా గ్రాండ్గా విడుదలైన విషయం తెలిసిందే మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసి విశ్వక్సేన్ ఈసారి ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని అనుకున్నాడు ఇక ఈ సినిమా కోసం ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు మొత్తానికి సినిమా విడుదలైన రోజే ఓవర్ కం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది దీంతో సినిమాకు బెస్ట్ ఓపెనింగ్ వచ్చాయి ఇక ఐదవ రోజు కలెక్షన్స్ ఎంత అలాగే ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్స్ ఎంత అనే వివరాల్లోకి వెళితే...

రిలీజ్ కు ముందే..

రిలీజ్ కు ముందే..

దాస్ కా ధమ్కీ సినిమా రిలీజ్ కాకముందే ప్రమోషన్స్ తో బాగానే ఆకట్టుకుంది. ఒక పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా విడుదల తరువాత మాస్ ఆడియెన్స్ ను మరింత ఆకట్టుకుంది. దాస్ కా ధమ్కీ సినిమాలో విశ్వక్ రెండు విభిన్నమైన గెటప్స్ లో మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు. అలాగే సినిమా సాంగ్స్ ట్రైలర్స్ కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి.

ధమ్కీ ప్రీ రిలీజ్ బిజినెస్

ధమ్కీ ప్రీ రిలీజ్ బిజినెస్

దాస్ కా ధమ్కీ సినిమాను డిమాండ్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలోనే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ కాబడం వలన మార్కెట్లో కూడా చెప్పుకోదగ్గ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. నైజంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 2.80 కోట్ల మేర బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.80 కోట్ల బిజినెస్ చేయగా.. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 70 లక్షలతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 7.50 కోట్ల బిజినెస్ చేసింది.

5వ రోజు ఏపీ నైజాం కలెక్షన్స్

5వ రోజు ఏపీ నైజాం కలెక్షన్స్

విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో చేసిన ధమ్కీ సినిమాకు కొంత మొదట్లో యావరేజ్ అనే టాక్ వచ్చింది. కానీ సినిమా అలాంటి టాక్ కు భిన్నంగా సాలీడ్ ఓపెనింగ్స్ అయితే అందుకుంది. 5వ రోజు ఏపి నైజాం కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 53 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 1.01 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

విశ్వక్ సేన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ 'దాస్ కా ధమ్కీ' సినిమా ఆంధ్రా, నైజాంలో 4వ రోజు రూ. 1.70 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇక 5వ రోజు కోటికి పైగా షేర్ రాగా.. మొత్తం 5 రోజుల్లో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.02 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.18కోట్లు లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 9.56 కోట్లు షేర్‌తో పాటు రూ. 18.88 కోట్లు గ్రాస్ వసూలైనట్లు తెలుస్తోంది.

ప్రాఫిట్ ఎంతంటే..

ప్రాఫిట్ ఎంతంటే..

విశ్వక్ సేన్ మాస్ మూవీ 'దాస్ కా ధమ్కీ' మొత్తానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేసుకొని లాభాల్లోకి వచ్చేసింది. బజ్ కు తగ్గట్టుగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ చేయగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లకు ఫిక్స్ అయ్యింది. అయితే 4 రోజుల్లో ఈ సినిమా టార్గెట్ ను పూర్తి చేసింది. మొత్తంగా 5 రోజుల్లో 9 కోట్లకు పైగా షేర్ తోప్రస్తుతం 1.56 కోట్ల ప్రాఫిట్ తో కొనసాగుతోంది. ధమ్కీ మిగిలిన రోజుల్లో మరింత కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా విశ్వక్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X