Das Ka Dhamki Closing Collections: విశ్వక్ సేన్ ధమ్కీ కథ ముగిసింది.. క్లొజింగ్ కలెక్షన్స్, లాభం ఎంతంటే?

యువ హీరో విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ మార్చి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు ఊహించని స్థాయిలో కలెక్షన్లు అందుకుంది. అయితే రెండవ రోజు రోజు నుంచి నెంబర్స్ మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. మొత్తానికి దసరా సినిమాకు రెండు వారాలు పూర్తి చేసుకోక ముందే క్లొజింగ్ దశకు వచ్చేసింది. ఇక బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టోటల్ గా ఎంత లాభాలను అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

దాస్ కా ధమ్కీ బిజినెస్

దాస్ కా ధమ్కీ బిజినెస్

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'దాస్ కా ధమ్కీ' సినిమా డిమాండ్ కు తగ్గట్టుగా నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 2.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా ఏపీ తెలంగాణలో రూ. 6.80 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 100 లక్షలతో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 10.50 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.

12వ రోజు ఎంత వచ్చింది?

12వ రోజు ఎంత వచ్చింది?

ధమ్కీ సినిమాకు ఫస్ట్ డే తర్వాత కలెక్షన్స్ చాలా వరకు తగ్గుతూ వచ్చాయి. ఇక ఈ సినిమా మొదటి వీకెండ్ అనంతరం థియేటర్ సంఖ్యను కూడా తగ్గించుకుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 11 కేవలం 16 లక్షలు మాత్రమే అందుకోగా.. 12వ రోజు 15 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

ఒక విధంగా ఇది 30 రోజుల క్రితం వచ్చిన బలగం సినిమా కంటే తక్కువ నెంబర్స్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాపై లేటెస్ట్ మూవీ దసరా ప్రభావం కూడా గట్టిగానే చూపించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా రెండవ వీకెండ్ లో కూడా గట్టి ధమ్కీ ఇచ్చింది.

నైజాం, ఏపీ కలెక్షన్స్

నైజాం, ఏపీ కలెక్షన్స్

'దాస్ కా ధమ్కీ'కి తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు దక్కాయి. ఇక ఏరియాల వారిగా ఇప్పటివరకు నైజాంలో రూ. 3.87 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.09 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 71 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, గుంటూరులో రూ. 72 లక్షలు, కృష్ణాలో రూ. 63 లక్షలు, నెల్లూరులో రూ. 34 లక్షలతో కలిపి...ఏపి నైజాంలో మొత్తంగా రూ. 9.04 కోట్లు షేర్, రూ. 16.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా క్లొజింగ్ కలెక్షన్స్

ప్రపంచవ్యాప్తంగా క్లొజింగ్ కలెక్షన్స్

విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' సినిమా ఆంధ్రా, తెలంగాణలో రూ. 9.04 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.30 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 11.54 కోట్లు షేర్‌తో పాటు రూ. 22.60 కోట్లు గ్రాస్ వసూలైంది.

ఫైనల్ లాభం ఎంతంటే..

ఫైనల్ లాభం ఎంతంటే..

టాలెంటెడ్ యువ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'దాస్ కా ధమ్కీ' సినిమా అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.54 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా ఫిక్స్ అయ్యింది. ఇక, 11 రోజుల్లో సినిమా రూ. 11.54 కోట్లు వచ్చాయి. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు టోటల్ గా క్లొజింగ్ దశకు ధమ్కీ సినిమా రూ. 3.54 కోట్లు ప్రాఫిట్స్ వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X