Gaami 10 Days Collections: విశ్వక్ సేన్ రికార్డు.. 10 రోజుల్లోనే కోట్ల వర్షం.. లాభం ఎంతో తెలిస్తే!

విశ్వక్ సేన్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ యంగ్ హీరో తనదైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ వెళ్తున్నాడు. దీనికితోడు విజయాలను కూడా అందుకుంటూ తన రేంజ్‌ను పెంచుకుంటున్నాడు.

ఈ ఊపులోనే ఇటీవలే విశ్వక్ సేన్ 'గామి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. దీనికి ఆరంభంలోనే మంచి స్పందన వచ్చింది. కానీ, తర్వాత డౌన్ అయినా లాభాలను తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో 'గామి' మూవీ 10 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే లుక్కేయండి!

Vishwak Sen Starrer Gaami Movie 10 Days Worldwide Collections

గామి అంటూ వచ్చిన హీరో
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా సినిమానే 'గామి'. విద్యాధర్ రూపొందించిన ఈ చిత్రాన్ని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా.. అభినయ కీలక పాత్రను చేసింది. మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావులు కీలక పాత్రలు పోషించారు. నరేష్ కుమరాన్ దీనికి సంగీతం సమకూర్చాడు.

Vishwak Sen Starrer Gaami Movie 10 Days Worldwide Collections

గామి సినిమాకు ప్రీ బిజినెస్

విశ్వక్ సేన్ చేసిన 'గామి' సినిమాకు నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో కలిపి ఈ చిత్రానికి రూ. 10.20 కోట్లు బిజినెస్ అయింది.

Vishwak Sen Starrer Gaami Movie 10 Days Worldwide Collections

10వ రోజు ఎంత వచ్చింది?
డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటోన్న విశ్వక్ సేన్ ఈ సారి 'గామి'తో వచ్చాడు. ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. కానీ, క్రమంగా ఇది డౌన్ అవుతూ వచ్చింది. అయితే, 10వ రోజు మరింతగా పుంజుకుంది. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 లక్షలు షేర్ వసూలు అయింది.

10 రోజుల్లో ఎంత వచ్చింది?

10 రోజుల్లో 'గామి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 78 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 68 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, గుంటూరులో రూ. 44 లక్షలు, కృష్ణాలో రూ. 42 లక్షలు, నెల్లూరులో రూ. 28 లక్షలతో కలిపి.. రూ. 8.11 కోట్లు షేర్, రూ. 14.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vishwak Sen Starrer Gaami Movie 10 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
విద్యాధర్ డైరెక్షన్‌లో యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 10 రోజుల్లో రూ. 8.11 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 89 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 10 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 11.40 కోట్లు షేర్‌, రూ. 22.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vishwak Sen Starrer Gaami Movie 10 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. లాభం అలా

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'గామి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.00 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 11.40 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 40 లక్షలు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X