Gaami 11 Days Collections: మరో రికార్డు దాటిన విశ్వక్ సేన్.. 11 రోజుల్లోనే అన్ని కోట్లు ఏంటి సామీ!
టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్నప్పటికీ.. అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును తెచ్చుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ డిఫరెంట్ మూవీలతో వస్తోన్న అతడు.. ఎన్నో హిట్లను కూడా అందుకున్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు 'గామి' అనే చిత్రంతో వచ్చాడు. విభిన్నమైన కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో వసూళ్లు భారీగా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ 'గామి' మూవీ 11 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే లుక్కేయండి మరి!
గామితో మరో కొత్త ప్రయోగం
విశ్వక్ సేన్ నటించిన ప్రయోగాత్మక చిత్రమే 'గామి'. విద్యాధర్ రూపొందించిన ఈ చిత్రాన్ని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా.. అభినయ కీలక పాత్రను చేసింది. మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావులు కీలక పాత్రలు పోషించారు. నరేష్ కుమరాన్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు.

గామి సినిమాకు ప్రీ బిజినెస్
విశ్వక్ సేన్ నటించిన 'గామి' సినిమాకు నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో కలిపి ఈ చిత్రానికి రూ. 11.20 కోట్లు బిజినెస్ జరిగింది.
11వ రోజు ఎంత వచ్చింది?
ఆరంభం నుంచీ కొత్త కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ దూసుకెళ్తోన్న విశ్వక్ సేన్ ఈ సారి 'గామి'తో వచ్చాడు. ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. కానీ, రెండో వారం నుచి క్రమంగా ఇది డౌన్ అవుతూ వస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 లక్షలు షేర్ వసూలు అయింది.

11 రోజుల్లో ఎంత వచ్చింది?
'గామి' మూవీకి 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.12 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 80 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 70 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు, గుంటూరులో రూ. 45 లక్షలు, కృష్ణాలో రూ. 44 లక్షలు, నెల్లూరులో రూ. 29 లక్షలతో కలిపి.. రూ. 8.31 కోట్లు షేర్, రూ. 14.90 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
విద్యాధర్ దర్శకత్వంలో యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 11 రోజుల్లో రూ. 8.31 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 90 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.42 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 11 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 11.63 కోట్లు షేర్, రూ. 22.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా
విభిన్నమైన కథతో వచ్చిన 'గామి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.00 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 11.63 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 63 లక్షలు లాభాలతో సత్తా చాటుకుంది.


Click it and Unblock the Notifications











