Gaami 2 Days Collections: విశ్వక్ వీర కుమ్ముడు.. గామికి భారీ వసూళ్లు.. 2 రోజుల్లోనే అన్ని కోట్లా!
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే తనదైన సినిమాలు చేసి విభిన్నమైన మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. దీనికితోడు ఎన్నో రకాల జోనర్లలో డిఫరెంట్ మూవీలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇలా వరుసగా సక్సెస్‌లను అందుకున్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు విశ్వక్ సేన్ 'గామి' అనే ప్రయోగాత్మక చిత్రం చేశాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగా వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు కూడా భారీగానే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'గామి' మూవీ రెండు రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే చూసేయండి మరి!
గామితో విశ్వక్ మరో ప్రయోగం:విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'గామి'. విద్యాధర్ రూపొందించిన ఈ మూవీని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. నరేష్ కుమరాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా.. అభినయ కీలక పాత్రను చేసింది. అలాగే, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావు తదితరులు నటించారు.

గామి సినిమాకు ప్రీ బిజినెస్:విశ్వక్ సేన్ నటించిన 'గామి'కి నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది.
2వ రోజు ఎంత వచ్చింది?:'గామి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 80 లక్షలు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 19 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి.. రూ. 1.69 కోట్లు షేర్, రూ. 3.05 కోట్లు గ్రాస్ వచ్చింది.
2 రోజుల్లో ఎంత వచ్చింది?:2 రోజుల్లో 'గామి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.29 కోట్లు, సీడెడ్‌లో రూ. 66 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 46 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, గుంటూరులో రూ. 25 లక్షలు, కృష్ణాలో రూ. 22 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో కలిపి.. రూ. 4.65 కోట్లు షేర్, రూ. 8.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:విద్యాధర్ కాగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 4.65 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 55 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.70 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 6.90 కోట్లు షేర్‌తో పాటు రూ. 15.10 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'గామి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.00 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 6.90 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 4.10 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











