Gaami 4 Days Collections: విశ్వక్ సేన్ మాస్ బ్యాటింగ్.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలిస్తే!
తెలుగు చిత్ర పరిశ్రమలోని యంగ్ హీరోలు అందరూ ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ డిఫరెంట్ మూవీలు చేస్తోన్న అతడు.. ఇటీవలే 'గామి' అనే విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచీ అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'గామి' మూవీ నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే చూసేయండి మరి!
మరో డిఫరెంట్ స్టోరీతో రాక
విశ్వక్ సేన్ హీరోగా నటించిన మరో డిఫరెంట్ మూవీనే 'గామి'. విద్యాధర్ రూపొందించిన ఈ మూవీని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా.. అభినయ కీలక పాత్రను చేసింది. అలాగే, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావు తదితరులు నటించారు. నరేష్ కుమరాన్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు.
గామి సినిమాకు ప్రీ బిజినెస్
విశ్వక్ సేన్ 'గామి' సినిమాకు నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 10.20 కోట్లు బిజినెస్ అయింది.

4వ రోజు ఎంత వచ్చింది
విద్యాధర్ కాగిత దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీకి ఫస్ట్ వీకెండ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే లభించాయి. అయితే, 4వ రోజు వర్కింగ్ డే కావడంతో రెస్పాన్స్ చాలా వరకూ తగ్గిపోయింది. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 51 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.
4 రోజుల్లో ఎంత వచ్చింది
'గామి' మూవీకి 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 87 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 54 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, గుంటూరులో రూ. 35 లక్షలు, కృష్ణాలో రూ. 32 లక్షలు, నెల్లూరులో రూ. 23 లక్షలతో కలిపి.. రూ. 6.62 కోట్లు షేర్, రూ. 12.15 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత
వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లో రూ. 6.62 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 76 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.15 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 9.53 కోట్లు షేర్‌తో పాటు రూ. 20 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి
విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'గామి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.00 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 9.53 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.47 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











