Gaami 5 Days Collections: టార్గెట్‌కు చేరువైన విశ్వక్ సేన్ గామి.. ఇంకెంత వస్తే హిట్ అవుతుందంటే!
టాలీవుడ్‌లోకి ఎంతో మంది యంగ్ హీరోలు పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు.
చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న అతడు.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇలా ఇటీవలే 'గామి' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి మంచి స్పందన వస్తోంది. తద్వారా కలెక్షన్లు కూడా గట్టిగానే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'గామి' మూవీ 5 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే చూసేయండి మరి!

విభిన్నమైన స్టోరీతో గామి
విభిన్నమైన స్టోరీతో విశ్వక్ సేన్ నటించిన సినిమానే 'గామి'. విద్యాధర్ రూపొందించిన ఈ మూవీని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా.. అభినయ కీలక పాత్రను చేసింది. అలాగే, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావు తదితరులు నటించారు. నరేష్ కుమరాన్ దీనికి సంగీతం ఇచ్చాడు.
గామి సినిమాకు ప్రీ బిజినెస్
విశ్వక్ సేన్ హీరోగా చేసిన 'గామి'కి నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో కలిపి ఈ చిత్రానికి రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది.
5వ రోజు ఎంత వచ్చింది?
విద్యాధర్ కాగిత రూపకల్పనలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' మూవీకి ఫస్ట్ వీకెండ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే లభించాయి. అయితే, 5వ రోజు రెస్పాన్స్ మరింతగా తగ్గిపోయింది. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

5 రోజుల్లో ఎంత వచ్చింది?
5 రోజుల్లో 'గామి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 91 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 68 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 34 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలతో కలిపి.. రూ. 6.94 కోట్లు షేర్, రూ. 12.75 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
విభిన్నమైన సబ్జెక్టుతో యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 6.94 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 79 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 9.93 కోట్లు షేర్‌తో పాటు రూ. 20.85 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'గామి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.00 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 9.93 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.07 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











