Gaami 6 Days Collections: గామికి ఊహించని వసూళ్లు.. విశ్వక్ నయా రికార్డు.. మొత్తం ఎన్ని కోట్లంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు.
డిఫరెంట్ మూవీలతో ఎన్నో హిట్లను అందుకుంటోన్న అతడు.. తన రేంజ్‌ను పెంచుకుంటూనే ఉన్నాడు. ఇలా ఇటీవలే 'గామి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. దీనికి మంచి స్పందన వస్తోంది. తద్వారా కలెక్షన్లు కూడా బాగానే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'గామి' మూవీ 6 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే చూసేయండి!

డిఫరెంట్ కాన్సెప్టుతో గామి
డిఫరెంట్ కాన్సెప్టుతో విశ్వక్ సేన్ నటించిన సినిమానే 'గామి'. విద్యాధర్ రూపొందించిన ఈ మూవీని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. నరేష్ కుమరాన్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా.. అభినయ కీలక పాత్రను చేసింది. అలాగే, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావు తదితరులు నటించారు.
గామి సినిమాకు ప్రీ బిజినెస్
విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీకి నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో కలిపి ఈ చిత్రానికి రూ. 10.20 కోట్లు బిజినెస్ అయింది.

6వ రోజు ఎంత వచ్చింది?
విద్యాధర్ కాగిత దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' మూవీకి ఫస్ట్ వీకెండ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా అదిరిపోయేలా వచ్చాయి. అయితే, 6వ రోజు రెస్పాన్స్ మరింతగా పడిపోయింది. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 26 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

6 రోజుల్లో ఎంత వచ్చింది?
'గామి' మూవీకి 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 93 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 70 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, గుంటూరులో రూ. 38 లక్షలు, కృష్ణాలో రూ. 36 లక్షలు, నెల్లూరులో రూ. 25 లక్షలతో కలిపి.. రూ. 7.20 కోట్లు షేర్, రూ. 12.70 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
సరికొత్త నేపథ్యం ఉన్న కథతో యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 7.20 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 81 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.24 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 6 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 10.25 కోట్లు షేర్, రూ. 19.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ సబ్జెక్టుతో రూపొందిన 'గామి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.00 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 10.25 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 75 లక్షలు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











