Gaami 7 Days Collections: 11 కోట్లు రావాలి.. వారంలోనే కోట్ల వర్షం.. మరి విశ్వక్ హిట్ కొట్టాడా అంటే!
టాలీవుడ్‌లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చినా.. తనదైన సినిమాలు చేస్తూ చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు విశ్వక్ సేన్. దీనికితోడు డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ మంచి పేరునూ సంపాదించుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే అతడు 'గామి' అనే మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మంచి స్పందన వచ్చింది. కానీ, తర్వాత రెస్పాన్స్ బాగా డౌన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో 'గామి' మూవీ 7 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే చూసేయండి మరి!
మరో ప్రయోగం చేసిన విశ్వక్:విశ్వక్ సేన్ నటించిన మరో ప్రయోగాత్మక సినిమానే 'గామి'. విద్యాధర్ రూపొందించిన ఈ మూవీని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. నరేష్ కుమరాన్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా.. అభినయ కీలక పాత్రను చేసింది. అలాగే, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావులు నటించారు.

గామి సినిమాకు ప్రీ బిజినెస్:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'గామి' మూవీకి నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో కలిపి ఈ చిత్రానికి రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది.
7వ రోజు డౌన్.. వారంలోనే:తెలుగు సినిమాల్లో గతంలో ఎన్నడూ టచ్ చేయని డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన 'గామి' సినిమాకు ఏడో రోజు కూడా ప్రేక్షకుల స్పందన తగ్గిపోయింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 20 లక్షలు షేర్ మాత్రమే వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా ఇది రూ. 25 లక్షలు కలెక్ట్ చేసింది. ఇలా వారంలోనే విశ్వక్ సేన్ సినిమాకు రూ. 10.50 కోట్లు షేర్ వచ్చింది.


Click it and Unblock the Notifications











