Gaami 8 Days Collections: విశ్వక్ సేన్ లక్కీ.. 8 రోజుల్లో అలాంటి వసూళ్లు.. అన్ని లక్షలు వస్తే హిట్టే!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా పరిచయమైన తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అంతేకాదు, వరుసగా హిట్లు మీద హిట్లను సాధించి సత్తా చాటాడు. దీంతో అతడి మార్కెట్, ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయాయి. ఈ ఊపులోనే ఇటీవలే విశ్వక్ సేన్ 'గామి' అనే మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మంచి స్పందన వచ్చింది. కానీ, తర్వాత రెస్పాన్స్ డౌన్ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 'గామి' మూవీ 8 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే చూసేయండి మరి!
గామి అంటూ వచ్చిన విశ్వక్
విభిన్నమైన కథతో విశ్వక్ సేన్ నటించిన సినిమానే 'గామి'. విద్యాధర్ రూపొందించిన ఈ మూవీని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. నరేష్ కుమరాన్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా.. అభినయ కీలక పాత్రను చేసింది. మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావులు కీలక పాత్రలు చేశారు.

గామి సినిమాకు ప్రీ బిజినెస్
యంగ్ హీరో విశ్వక్ సేన్ 'గామి' మూవీకి నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో కలిపి ఈ చిత్రానికి రూ. 10.20 కోట్లు బిజినెస్ అయింది.
8వ రోజు ఎంత వచ్చింది?
ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీలు చేసే విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' మూవీకి ఫస్ట్ వీకెండ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. దీంతో కలెక్షన్లు కూడా భారీ స్థాయిలోనే వచ్చాయి. అయితే, 8వ రోజు రెస్పాన్స్ మరింతగా డౌన్ అయిపోయింది. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

8 రోజుల్లో ఎంత వచ్చింది?
8 రోజుల్లో 'గామి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.83 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.01 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 74 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 64 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, గుంటూరులో రూ. 40 లక్షలు, కృష్ణాలో రూ. 38 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో కలిపి.. రూ. 7.62 కోట్లు షేర్, రూ. 13.40 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
విభిన్నమైన కథతో యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 7.62 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 85 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.28 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 10.75 కోట్లు షేర్, రూ. 20.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'గామి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.00 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 10.75 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 25 లక్షలు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











