Gaami 9 Days Collections: విశ్వక్ మాస్ బ్యాటింగ్.. అన్ని కోట్ల టార్గెట్ ఔట్.. 4వ సినిమాగా రికార్డు

టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోలు వచ్చినా.. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతోన్న విశ్వక్ సేన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ తనదైన పంథాను ఫాలో అవుతోన్న అతడు.. ఎన్నో హిట్లను అందుకున్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు విశ్వక్ సేన్ 'గామి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. దీనికి ఆరంభంలోనే మంచి స్పందన వచ్చింది. కానీ, తర్వాత డౌన్ అయినా టార్గెట్‌ను చేరుకుంది. ఈ నేపథ్యంలో 'గామి' మూవీ 9 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే లుక్కేయండి మరి!

విశ్వక్ మరో ఎక్స్‌పిరమెంట్
విశ్వక్ సేన్ నటించిన మరో ఎక్స్‌పిరమెంట్ మూవీనే 'గామి'. విద్యాధర్ రూపొందించిన ఈ చిత్రాన్ని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. నరేష్ కుమరాన్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా.. అభినయ కీలక పాత్రను చేసింది. మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావులు కీలక పాత్రలు పోషించారు.

Vishwak Sen Starrer Gaami Movie 9 Days Worldwide Collections

గామి సినిమాకు ప్రీ బిజినెస్

విశ్వక్ సేన్ నటించిన 'గామి' సినిమాకు నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో కలిపి ఈ చిత్రానికి రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది.

Vishwak Sen Starrer Gaami Movie 9 Days Worldwide Collections

9వ రోజు ఎంత వచ్చింది?
కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీకి ఫస్ట్ వీకెండ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. కానీ, క్రమంగా ఇది డౌన్ అవుతూ వస్తోంది. అయితే, 9వ రోజు మళ్లీ పుంజుకుంది. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 లక్షలు షేర్ వసూలు అయింది.

Vishwak Sen Starrer Gaami Movie 9 Days Worldwide Collections

9 రోజుల్లో ఎంత వచ్చింది?

'గామి' మూవీకి 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 76 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 66 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 42 లక్షలు, కృష్ణాలో రూ. 40 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో కలిపి.. రూ. 7.87 కోట్లు షేర్, రూ. 13.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vishwak Sen Starrer Gaami Movie 9 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
డిఫరెంట్ కథతో యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 7.89 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 87 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.31 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 11.05 కోట్లు షేర్‌, రూ. 21.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vishwak Sen Starrer Gaami Movie 9 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. లాభం అలా

భిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'గామి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.00 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 11.05 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5 లక్షలు లాభాలు వచ్చాయి. తద్వారా ఈ ఏడాది టాలీవుడ్‌లో హిట్ కొట్టిన నాలుగో చిత్రంగా ఇది రికార్డు సాధించింది. దీనికంటే ముందు హనుమాన్, నా సామిరంగ, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీలు క్లీన్ హిట్లుగా నిలిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X