Gaami Closing Collections: 11 కోట్లు వస్తే హిట్.. గామికి దిమ్మతిరిగే వసూళ్లు.. విశ్వక్‌కు లాభం ఎంతంటే!
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే హీరోగా పరిచయమైనా.. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు విశ్వక్ సేన్. ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే వరుసగా మూవీలు చేస్తోన్న అతడు.. ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవలే విశ్వక్ 'గామి' అనే మరో ఎక్స్‌పిరమెంట్ మూవీతో వచ్చాడు. విభిన్నమైన కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన రావడంతో వసూళ్లు భారీగా లభించాయి. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ 'గామి' మూవీ ఫుల్ రన్‌లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే లుక్కేయండి మరి!
గామి అంటూ వచ్చిన హీరో:విభిన్నమైన కథతో విశ్వక్ సేన్ నటించిన సినిమానే 'గామి'. విద్యాధర్ రూపొందించిన ఈ చిత్రాన్ని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా.. అభినయ కీలక పాత్రను చేసింది. మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావులు కీలక పాత్రలు పోషించారు. నరేష్ కుమరాన్ దీనికి సంగీతం ఇచ్చాడు.

గామి సినిమాకు ప్రీ బిజినెస్:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'గామి' సినిమాకు నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో రూ. 2 కోట్లు చేసింది. వీటితో కలిపి దీనికి రూ. 11.20 కోట్లు బిజినెస్ అయింది.
అలాంటి టాక్‌తో భారీగానే:హీరోగా పరిచయమైనప్పటి నుంచే కొత్త కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ దూసుకెళ్తోన్న విశ్వక్ సేన్ ఈ సారి 'గామి'తో వచ్చాడు. దీనికి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ లభించింది. ఫలితంగా ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. అయితే, రెండో వారం నుంచి డౌన్ అయింది. అయినా దీనికి వసూళ్లు భారీగానే లభించాయి.

తెలుగులో ఎంత వచ్చింది?:'గామి' మూవీకి ఫుల్ రన్‌లో తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.14 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 82 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 71 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 46 లక్షలు, కృష్ణాలో రూ. 45 లక్షలు, నెల్లూరులో రూ. 29 లక్షలతో కలిపి.. రూ. 8.41 కోట్లు షేర్, రూ. 15.05 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:విద్యాధర్ దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫుల్ రన్‌లో రూ. 8.41 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 91 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.44 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొత్తంగా ఈ చిత్రానికి రూ. 11.76 కోట్లు షేర్, రూ. 22.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'గామి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.00 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో ఈ సినిమాకు రూ. 11.76 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 76 లక్షలు లాభాలతో ఈ మూవీ సత్తా చాటుకుంది.


Click it and Unblock the Notifications











