Gaami Business: విశ్వక్ సేన్ మూవీకి భారీ బిజినెస్.. హిట్ సినిమాకు సమానంగా.. హిట్ టార్గెట్ ఎంతంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ మంది హీరోలు మాత్రమే ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ స్పెషల్ అనిపించుకుంటున్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. ప్రతి సినిమాతో మంచి స్పందనను అందుకుంటోన్న అతడు.. 'ధమ్కీ' హిట్‌తో మంచి జోష్ మీద ఉన్నాడు.
ఈ ఊపులోనే ఇప్పుడు 'గామి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది? ఎంత వసూలు చేస్తే క్లీన్ హిట్‌గా నిలుస్తుంది? అనే వివరాలను మీరే చూసేయండి!

గామి అంటూ విశ్వక్ ప్రయోగం: విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ రూపొందించిన చిత్రమే 'గామి'. దీన్ని యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. నరేష్ కుమరాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించగా.. అభినయ కీలక పాత్రను చేసింది. అలాగే, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావు తదితరులు నటించారు.

అలాంటి స్టోరీ.. ఆసక్తికరంగా: విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీ ప్రయోగాత్మక కథతో రాబోతుంది. ఓ వింత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న హీరో.. పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లడం.. అక్కడ అతడికి ఎన్నో అడ్డంకులు రావడం.. వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకట్టుకుని విడుదల కాబోతుంది.

రిలీజ్‌కు రెడీ.. ఫుల్ రెస్పాన్స్: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'గామి' మూవీని మార్చి 8వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఎప్పటి నుంచో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సందడి కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు విశ్వక్ సేన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే బుకింగ్స్ విషయంలో కూడా ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది.
హక్కులకు మంచి డిమాండ్: విద్యాధర్ డైరెక్షన్‌లో విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల రైట్స్ మంచి ధరలకే అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఏపీ, తెలంగాణలో బిజినెస్: విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 3.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిసి దీనికి రూ. 8.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
వరల్డ్ వైడ్ బిజినెస్ ఇలా: 'గామి' మూవీకి ఆరంభంలోనే మంచి బజ్ క్రియేట్ అయింది. దీంతో ఈ సినిమా హక్కులు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ ఏరియాల హక్కులు రూ. 2.00 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే ఇది హిట్ అవ్వాలంటే మాత్రం రూ. 11 కోట్లు షేర్ వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

ఆ సినిమాతో సమానంగా: విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది. తద్వారా ఈ మధ్య కాలంలో అతడి నుంచి వచ్చిన సూపర్ హిట్ మూవీ 'దాస్ కా ధమ్కీ' బిజినెస్ రూ. 10.50 కోట్లకు ఇది చేరువగానే వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











