Gangs Of Godavari 2 Days Collections: కుమ్మేసిన విశ్వక్.. 2 రోజుల్లో కోట్ల వర్షం.. టాప్ మూవీగా రికార్డు
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే తనదైన సినిమాలు చేసి మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. దీనికితోడు ఎన్నో రకాల జోనర్లలో డిఫరెంట్ మూవీలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇలా వరుసగా సక్సెస్‌లను అందుకున్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే చిత్రం చేశాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చినా రెస్పాన్స్ భారీగా వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు కూడా పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ 2 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో చూసేయండి!
ఊరమాస్ కథతో విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా ఊరమాస్ చిత్రమే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య తీసిన సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా.. అంజలి, నాజర్ కీలక పాత్రలను పోషించారు.

విశ్వక్ మూవీకి ప్రీ బిజినెస్
విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'కి నైజాంలో రూ. 3.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.70 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.30 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో కలిపి ఈ చిత్రానికి రూ. 10.30 కోట్లు బిజినెస్ జరిగింది.
2వ రోజు ఎంత వచ్చింది?
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 72 లక్షలు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 17 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రూ. 1.55 కోట్లు షేర్, రూ. 2.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజుల్లో ఎంత వచ్చింది?
2 రోజుల్లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'కి తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.82 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.00 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 63 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 40 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, గుంటూరులో రూ. 38 లక్షలు, కృష్ణాలో రూ. 29 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 5.06 కోట్లు షేర్, రూ. 8.55 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 5.06 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 85 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 6.26 కోట్లు షేర్‌తో పాటు రూ. 11.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
మాస్ స్టోరీతో రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.00 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 6.26 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 4.74 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











