Gangs Of Godavari 5 Days Collections: ఒక్కసారిగా డౌన్.. 5 రోజుల్లో కోట్ల సునామీ.. సంచలనం దిశగా విశ్వక్
సాధారణంగా ఏ యంగ్ హీరో అయినా సక్సెస్ కావాలంటే చాలా కాలం పడుతుంది. కానీ, కొందరు మాత్రం తమదైన టాలెంట్లతో మెప్పించి ఆరంభంలోనే సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో విశ్వక్ సేన్ ఒకడు. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న అతడు.. అదే ఊపులో ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే చిత్రం చేశాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చినా రెస్పాన్స్ భారీగా వస్తోంది. అయితే, ఇప్పుడు డౌన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ 5 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే చూసేయండి!
గోదావరి స్టోరీతో విశ్వక్ సేన్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఊరమాస్ సినిమానే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య తీసిన సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా.. అంజలి, నాజర్ కీలక పాత్రలు చేశారు.

విశ్వక్ మూవీకి ప్రీ బిజినెస్
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు నైజాంలో రూ. 3.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.70 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.30 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో కలిపి ఈ చిత్రానికి రూ. 10.30 కోట్లు బిజినెస్ జరిగింది.
6వ రోజు డౌన్.. టోటల్‌గా
కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా రెస్పాన్స్ రాబడుతోంది. కానీ, ఐదో రోజు మాత్రం ఒక్కసారిగా డౌన్ అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 50 లక్షలు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 60 లక్షలు రాబట్టింది. ఇలా 5 రోజుల్లో రూ. 9.40 కోట్లు వచ్చాయి.


Click it and Unblock the Notifications











