Gangs Of Godavari 6 Days Collections: మరింత తగ్గిన వసూళ్లు.. 6 రోజుల్లో అన్ని కోట్లు.. ఇంకెంత రావాలంటే!
టాలీవుడ్‌లో అతి తక్కువ మంది హీరోలు మాత్రమే తమదైన చిత్రాలతో సందడి చేస్తూ.. సినిమా సినిమాకూ రేంజ్‌ను పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. విభిన్నమైన కథలతో మూవీలు చేస్తోన్న అతడు.. ఈ మధ్యన వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే చిత్రం చేశాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చినా రెస్పాన్స్ భారీగా వస్తోంది. అయితే, ఇప్పుడు డౌన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ 6 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే లుక్కేయండి!
మాస్ స్టోరీతో వచ్చిన విశ్వక్:టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఊరమాస్ సినిమానే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య తీసిన సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా.. అంజలి, నాజర్ కీలక పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చాడు.

విశ్వక్ మూవీకి ప్రీ బిజినెస్:విశ్వక్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు నైజాంలో రూ. 3.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.70 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.30 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో కలిపి ఈ చిత్రానికి రూ. 10.30 కోట్లు బిజినెస్ అయింది.
6వ రోజు ఎంత వచ్చింది?:కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమా అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. కానీ, ఈ వీక్ డేస్‌లో మాత్రం ఇది డౌన్ అవుతూనే ఉంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు రూ. 37 షేర్‌తో పాటు రూ. 70 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

6 రోజుల్లో ఎంత వచ్చింది?:6 రోజుల్లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'కి తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.11 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.54 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 95 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 64 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 49 లక్షలు, గుంటూరులో రూ. 58 లక్షలు, కృష్ణాలో రూ. 49 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో.. రూ. 8.15 కోట్లు షేర్, రూ. 14.15 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 8.15 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 60 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఆరు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 9.85 కోట్లు షేర్‌తో పాటు రూ. 18.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:మాస్ స్టోరీతో రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.00 కోట్లుగా నమోదైంది. ఇక, ఆరు రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 9.85 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.15 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











