Gangs Of Godavari 7 Days Collections: 11 కోట్లు రావాలి.. వారంలో భారీగా.. విశ్వక్ హిట్ కొట్టాలంటే మాత్రం!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్‌ను త్వరగా దక్కించుకున్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్న అతడు.. మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతోన్నాడు. ఇలా ఇప్పుడు విశ్వక్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే చిత్రం చేశాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చినా రెస్పాన్స్ బాగానే వస్తోంది. అయితే, ఆ తర్వాత మాత్రం డౌన్ అవుతోంది. ఈ నేపథ్యంలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ 7 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే చూడండి!
ఊరమాస్ అవతారంతోనే
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఊరమాస్ సినిమానే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య తీసిన సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా.. అంజలి, నాజర్ కీలక పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని ఇచ్చాడు.

విశ్వక్ మూవీకి ప్రీ బిజినెస్
విశ్వక్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'కు నైజాంలో రూ. 3.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.70 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.30 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో దీనికి రూ. 10.30 కోట్లు బిజినెస్ అయింది.
7వ రోజు ఎంత వచ్చింది?
కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. కానీ, ఈ వీక్ డేస్‌లో మాత్రం ఇది క్రమంగా పడిపోతూనే ఉంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు రూ. 31 షేర్‌తో పాటు రూ. 60 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

7 రోజుల్లో ఎంత వచ్చింది?
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'కి 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.23 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.58 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 98 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 67 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, గుంటూరులో రూ. 61 లక్షలు, కృష్ణాలో రూ. 51 లక్షలు, నెల్లూరులో రూ. 37 లక్షలతో.. రూ. 8.46 కోట్లు షేర్, రూ. 14.75 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 7 రోజుల్లో రూ. 8.46 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 62 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.12 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఏడు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 10.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 18.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ స్టోరీతో రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.00 కోట్లుగా నమోదైంది. ఇక, ఏడు రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 10.20 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 80 లక్షలు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











