Gangs Of Godavari Collections: 11 కోట్లు రావాలి.. ఫుల్ రన్‌లో అన్ని కోట్లు.. ఇంతకీ హిట్టా ఫట్టా అంటే!

టాలీవుడ్‌లో అతి తక్కువ మంది హీరోలు మాత్రమే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు విజయాలను అందుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. ఈ మధ్య కాలంలో డిఫరెంట్ మూవీలతో వచ్చి సత్తా చాటుతోన్న అతడు.. మరో సక్సెస్ కోసం ఇటీవలే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే చిత్రం చేశాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చినా రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయితే, ఆ తర్వాత మాత్రం క్రమంగా డౌన్ అయింది. ఈ నేపథ్యంలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ ఫుల్ రన్‌లో ఎన్ని కోట్లు రాబట్టిందో మీరే చూడండి!

రూరల్ మాస్ స్టోరీతో విశ్వక్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఊరమాస్ సినిమానే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య తీసిన సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీకర స్టూడియోస్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌‌గా.. అంజలి, నాజర్ కీలక పాత్రలు చేశారు. యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్ ఇచ్చాడు.

Vishwak Sen Starrer Gangs Of Godavari Movie Closing Worldwide Collections

విశ్వక్ మూవీకి ప్రీ బిజినెస్
విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'కు నైజాంలో రూ. 3.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.40 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.70 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.30 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో దీనికి రూ. 10.30 కోట్లు బిజినెస్ జరిగింది.

అలాంటి టాక్‌తో మంచిగా
కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రానికి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ లభించాయి. ఆ తర్వాత కూడా టాక్‌తో సంబంధం లేకుండా రెస్పాన్స్ దక్కింది. అయితే, ఈ సినిమా మొదటి వారం తర్వాత క్రమంగా డౌన్ అవుతూ రన్‌ను ముగించుకుంది.

Vishwak Sen Starrer Gangs Of Godavari Movie Closing Worldwide Collections

తెలుగులో ఎంత వచ్చింది?
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'కి ఫుల్ రన్‌లో తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 69 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 54 లక్షలు, గుంటూరులో రూ. 65 లక్షలు, కృష్ణాలో రూ. 54 లక్షలు, నెల్లూరులో రూ. 37 లక్షలతో.. రూ. 8.70 కోట్లు షేర్, రూ. 15.75 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫుల్ రన్‌లో రూ. 8.70 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 65 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.15 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొత్తంగా ఈ చిత్రానికి రూ. 10.50 కోట్లు షేర్‌తో పాటు రూ. 19.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vishwak Sen Starrer Gangs Of Godavari Movie Closing Worldwide Collections

టార్గెట్ ఇలా.. హిట్టేనా?
మాస్ స్టోరీతో రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11.00 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్ ఈ సినిమాకు రూ. 10.50 కోట్లు వచ్చాయి. తద్వారా బిజినెస్‌ టార్గెట్‌ను మాత్రమే చేరుకుని సెమీ హిట్‌గానే నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X