Gangs Of Godavari Business: విశ్వక్ సేన్ మూవీకి భారీ బిజినెస్.. ఆ మూవీ కంటే తక్కువగా.. హిట్ కావాలంటే!
టాలీవుడ్‌లో అతి తక్కువ మంది హీరోలు మాత్రమే ఆరంభంలోనే మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. ఈ మధ్య కాలంలో తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న అతడు.. వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే సినిమాలో నటించాడు. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా బిజినెస్‌పై మీరే లుక్కేయండి మరి!
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ
ఫుల్ ఫామ్‌లో ఉన్న విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రమే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య తీసిన సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా.. అంజలి, నాజర్ కీలక పాత్రల్లో నటించారు.

అలాంటి స్టోరీ.. ఆసక్తికరంగా
విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ రూరల్ బ్యాగ్‌డ్రాప్ స్టోరీలైన్‌తో రాబోతుంది. ఓ సాధారణ కుర్రాడు పరిస్థితుల ప్రభావంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత అతడికి ఎన్నో సవాళ్లు రావడం అనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. దీంతో ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఫలితంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
రిలీజ్‌కు రెడీ.. ఫుల్ రెస్పాన్స్
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీని మే 31వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఎప్పటి నుంచో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సందడి కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు విశ్వక్ సేన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే బుకింగ్స్ విషయంలో కూడా ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్‌ను అందుకుంది.

హక్కులకు మంచి డిమాండ్
విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల రైట్స్ మంచి ధరలకే అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఏపీ, తెలంగాణలో బిజినెస్
కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ వచ్చింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 8.00 కోట్ల థియేట్రికల్ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంతేకాదు, అందుకు అనుగుణంగానే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 500 వరకూ థియేటర్లలో విడుదల అవుతుంది.

వరల్డ్ వైడ్ బిజినెస్ ఇలా
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీకి ఆరంభంలోనే మంచి బజ్ క్రియేట్ అయింది. దీంతో ఈ సినిమా హక్కులు కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ ఏరియాల హక్కులు రూ. 2.00 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.00 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే ఇది హిట్ అవ్వాలంటే మాత్రం రూ. 11 కోట్లు షేర్ వసూలు చేయాల్సిన అవసరం ఉంది.
ఆ సినిమాతో సమానంగా
విశ్వక్ సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగింది. అయితే, ఇది అతడి గత చిత్రాల కంటే తక్కువే అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో అతడి నుంచి వచ్చిన సూపర్ హిట్ మూవీ 'దాస్ కా ధమ్కీ' బిజినెస్ రూ. 10.50 కోట్లు చేసింది. అలాగే, 'గామి' మూవీ రూ. 10.20 కోట్లు బిజినెస్‌ను చేసుకున్నాయి.


Click it and Unblock the Notifications











