కపేలా రీమేక్‌లో విశ్వక్ సేన్.. మరో మాస్ పాత్రలో దాస్
వరుస విజయాలను ఖాతాలో వేసుకొంటున్న టాలెంటెండ్ యాక్టర్, రైటర్ విశ్వక్ సేన్ మరో క్రేజీ ప్రాజెక్టులో కీలక పాత్రను పోషించబోతున్నారు. ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో రిలీజై విమర్శల ప్రశంసలు అందుకొంటున్న కపేలా చిత్రంలో రాయ్ అనే పాత్రను పోషిస్తున్నట్టు చిత్ర యూనిట్ ధృవీకరించింది. అన్యాయం జరిగితే సహించని యువకుడి పాత్రలో విశ్వక్ సేన్ నటించబోతున్నారు.
గ్రామీణ ప్రాంతంలోని యువతి జెస్సీ (అన్నా బెన్) విష్ణు అనే ఆటో డ్రైవర్‌తో ప్రేమలో పడుతుంది? ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉండటంతో విష్ణుతో కలిసి జెస్సీ ఊరి నుంచి లేచిపోతుంది. అలా పట్నం చేరిన జెస్సీకి విష్ణు నిజ స్వరూపం తెలుస్తుంది? ఆ క్రమంలో విష్ణు నుంచి తప్పించుకోవాలని చూసే క్రమంలో పట్టణంలో ఆమెను రాయ్ (రోహన్ మ్యాథ్యూ) కాపాడుతాడు. రాయ్ ఎవరు? జెస్సీని ఎందుకు కాపాడారు అనే ప్రశ్నలకు సమాధానమే కపేలా సినిమా కథ.

మలయాళంలో మహ్మద్ ముస్తాఫా దర్శకత్వం వహించిన కపేలా చిత్రం రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ పొందిన సంగతి తెలిసిందే. ఇటీవలే రీమేక్ హక్కులు పొందడంపై ఆ సంస్థ అధినేత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే నటీనటుల ఎంపిక పూర్తవుతుందని వెల్లడించారు.
టాలీవుడ్‌లో కరోనా పరిస్థితులన్నీ అదుపులోకి వస్తే.. ఈ ఏడాది చివరల్లో కపేలా మూవీ రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని, అలాగే తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











