twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్ రిపోర్ట్: బాహుబలి 2 రికార్డ్ బ్రేక్.. డివైడ్ టాక్‌తో సైతం గర్జించిన కమల్ విశ్వరూపం 2!

    |

    లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశ్వరూపం మొదటి భాగం వచ్చిన ఐదేళ్ల తరువాత కమల్ విశ్వరూపం 2 విడుదుల చేశారు. తొలి షో నుంచి ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. సినీక్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినా కూడా విశ్వరూపం 2 తొలిరోజు వసూళ్లు బాక్స్ ఆఫీస్ వద్ద సింహ గర్జనలా ప్రారంభమయ్యాయి.

    అడ్వాన్స్ బుకింగ్స్ లేకున్నా

    అడ్వాన్స్ బుకింగ్స్ లేకున్నా

    విశ్వరూపం 2 చిత్ర విడుదల చివరి నిమిషం వరకు అనుమానంగానే ఉంది. దీనితో అడ్వాన్స్ బుకింగ్స్ పై ప్రభావం పడింది. అయినా కూడా తొలి రోజు వసూళ్లు అదుర్స్ అనిపించే విధంగా ఉన్నాయి. కమల్ నటించిన యాక్షన్ ఫిలిం కోసం ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూడటమే దీనికి కారణం.

     బాహుబలి 2 రికార్డు బ్రేక్

    బాహుబలి 2 రికార్డు బ్రేక్

    విశ్వరూపం 2 చిత్రం తొలి రోజు చెన్నైలో బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసింది. విశ్వరూపం 2 వసూళ్లు ఏ రేంజ్ లో ఉన్నాయో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. చెన్నై లో బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేస్తూ విశ్వరూపం 2 చిత్రం తొలిరోజు 93 లక్షల గ్రాస్ రాబట్టింది.

    రెండు భాషల్లో

    రెండు భాషల్లో

    బాహుబలి 2 చెన్నైలో తెలుగు, తమిళ భాషల్లో కలిపి తొలిరోజు 92 లక్షల గ్రాస్ వసూలు చేసింది. విశ్వరూపం 2 అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న విధంగా జరిగి ఉంటె వసూళ్లు ఇంకా అధికంగా ఉండేవి.

     ఇలాంగే కొనసాగితే

    ఇలాంగే కొనసాగితే

    ఇదే రేంజ్ లో తొలి వారం వసూళ్లు కొనసాగితే విశ్వరూపం 2 విజయం సాధించినట్లే. కానీ డివైడ్ టాక్ ఉన్న నేపథ్యంలో వీకెండ్ వసూళ్లు ఎలా ఉంటాయో వేచి చూడాలి. మొదటి భాగం స్థాయిలో రెండవ భాగం లేదనే అభిప్రాయం ఆడియన్స్ నుంచి వ్యక్తం అవుతోంది.

     ఆరవ స్థానంలో

    ఆరవ స్థానంలో

    చైన్నైలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో విశ్వరూపం 6వ స్థానంలో నిలిచింది. 1.75 కోట్లతో కాలా, అజిత్ వివేగం 1.21 కోట్లు, కబాలి 1.12 కోట్లు, తేరి 1. 05 కోట్లు గతంలో చెన్నైలో నమోదైన అత్యధిక వసూళ్లు.

    English summary
    Vishwaroopam 2 box office collection Day 1. Kamal Haasan film sets ticket windows on fire
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X