ఓవర్సీస్‌లో అదరగొడుతున్న ‘విశ్వరూపం’
చెన్నై : కమల్ హాసన్ విశ్వరూపం తమిళనాడుతో పాటు సౌతిండియాలోని పలు చోట్ల విడుదల కాకుండా ఇబ్బిందులు పుడుతున్నప్పటికీ.....ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో విడుదలై విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. తాజాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తూ చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా యూఎస్, యూకె బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను ఇస్తోంది.
యూఎస్ బాక్సాఫీస్
ఓపెనింగ్ వీకెండ్ 'విశ్వరూపం' చిత్రం ఇక్కడ 44 స్క్ర్రీన్లలో విడుదలై $6,34,912(రూ. 3.43 కోట్లు-గురువారం ప్రీమియర్ షోతో కలుపుకుని) వసూళ్లు సాధించింది. ఒక్కో స్క్రీన్ పై యావరేజ్ గా $14,430(రూ. 7.77 లక్షలు) వసూలు చేసింది. తెలుగు వెర్షన్ 28 స్క్రీన్లలో విడుదలై $1,02,657(రూ. 55.38 లక్షలు) వసూలు చేసింది. యావరేజ్ గా ఒక్కో స్క్రీన్ కు $3,666 (రూ. 1.97 లక్షలు) వసూలైంది.
యూకె మరియు ఐర్లాండ్ బాక్సాఫీస్
విశ్వరూపం ఇక్కడ 19 స్క్రీన్లలో విడుదలై తొలి వీకెండ్ మొత్తం £95,676(రూ. 81.23 లక్షలు) వసూలు చేసింది. ఒక్కో స్క్రీన్ యావరేజ్ £5,036(Rs 4.26 లక్షలు).
కమల్ హాసన్ 'విశ్వరూపం' చిత్రంలో తమ మనోభావాలు దెబ్బతినే విధంగా సన్ని వేశాలు ఉన్నాయనే అనుమానంతో పలు ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగడం, తమిళనాడు ప్రభుత్వం ఈ చిత్రంపై 15 రోజుల బ్యాన్ విధించడం తెలిసిందే. కమల్ హాసన్ కోర్టు కెక్కడంతో ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది కోర్టు. సినిమాలో తమకు అభ్యంతర కరంగా ఉన్న సీన్లు(దాదాపు అరగంట)కట్ చేసి సినిమా విడుదల చేసుకోవచ్చని ఆందోళన కారులు అంటున్నారు. అయితే కమల్ హాసన్ ఇందుకు ససేమిరా అంటున్నారు. రెండున్నర గంటల సినిమాలో అరగంట సినిమాకు కత్తెర పెడితే తాను తీవ్రంగా నష్టపోతానని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











